Ramayana Movie : బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రామాయణ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది.. నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి ఇక వీకెండ్ కలెక్షన్స్ కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంటే కానీ ఓ దేశంలో మాత్రం సినిమాకి ఊహించని షాక్ ఎదురైంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ కూడా వినిపిస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. ఇంతకీ రామాయణం సినిమాని ఎందుకు అక్కడ బ్యాన్ చేస్తారు అన్నది ఇప్పటికీ జనాల్లో ప్రశ్న గానే ఉంది. మరి ఆ దేశంలో ఎందుకు ఈ సినిమాని బ్యాన్ చేశారు అన్నది ఇప్పుడు మనం కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..
4వేల కోట్ల రూపాయాలతో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. రెండు రోజులు అయినా కూడా సినిమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ రోజురోజుకి జోరు అందుకుంటున్నాయి. అలాంటి సందర్భంలో ఓ దేశంలో ఈ సినిమాని పూర్తిగా బ్యాన్ చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.. వివరాల్లోకి వెళితే.. రామాయణ సినిమాపై సౌదీ అరేబియా, క్వతర్ ప్రాంతాల్లో నిషేధం విధించినట్టు ఓ టాక్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండడంతో రామాయణ ఫాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ వార్తల్లో నిజం లేదన్న వాదన కూడా మరోవైపు వినిపిస్తుంది.. అక్కడ కేవలం సెన్సార్ కారణాలవల్లే సినిమా ఆలస్యం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు. కానీ ఈ చిత్ర టీమ్స్ స్పందించేంత వరకు దీని గురించి క్లారిటీ అయితే రాలేదు. ఇది ఏమైనా కూడా ఈ సినిమాపై ఇలాంటి వార్తలు వినిపించడం కొందరు ఫాన్స్ కి నిరాశను కలిగించిందని తెలుస్తుంది.
బాలీవుడ్ లో స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో పాటుగా విజువల్స్ జనాలను ఆకట్టుకోవడంతో ఈ మూవీని చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో సినిమా బుకింగ్స్ లో జోరు పెరిగింది. ఇక భారీ ఓపెనింగ్స్ ని సాధించి ఈ ఏడాదిలో మరో రికార్డు సెట్ చేసింది. అయితే ఇండియా వరకు రిలీజ్ అయ్యిన రోజే 24 గంటల్లో 1 మిలియన్ కి పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది.. మరి ఈ మూవీకి ఎలాంటి రికార్డులు సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read :రష్మిక మందన్న నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?