Bollywood Diwali:దీపావళి పండుగ వచ్చిందంటే చాలు..బాలీవుడ్‌లో ఒక రేంజ్ లో సందడి మొదలైపోతుంది.ముఖ్యంగా దీపావళి సందర్భంగా బాలీవుడ్ స్టార్స్ ఇచ్చే పార్టీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలీవుడ్‌లో జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆయుష్మాన్ ఖురానా, ఆయన భార్య తాహిరా కశ్యప్ నిర్వహించిన దీపావళి వేడుకలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి. ముంబైలోని తమఇంట్లో ఈ జంట సినీ ఇండస్ట్రీకి కోసం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయగా ఇందులో పలువురు సెలెబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.
ట్రెడిషనల్ ఫెస్టివల్ అవడంతో అందుకు తగ్గట్టుగా సెలబ్రిటీలు కాస్ట్యూమ్స్ దరించి ఫ్యాన్స్ ని ఫిదా చేశారు.ముఖ్యంగా యంగ్ హీరోయిన్ ఖుషీ కపూర్ తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించిందనే చెప్పాలి. ఖుషీ కపూర్ ఇప్పటికే ది ఆర్చీస్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైందన్న సంగతి తెలిసిందే.
ప్రతి ఏడాది తమ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి జరుపుకోవడం ఈ జంటకు అలవాటు. ఈసారి కూడా ఇలాగే ఈవెంట్ ఏర్పాటు చేయగా స్టార్స్పాల్గొని సందడి చేశారు. ఇక తాహిరా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో సెలబ్రిటీలు సరదాగా ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. ఇక ఈ పార్టీ ఉదయం ఐదు గంటల వరకు జరగడం బట్టి చూస్తే
ఈ పార్టీ ఎంత సందడిగా సాగిందో అర్థమయిపోతుంది.
ఇక మరోవైపు నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత జాకీ భగ్నానీ జోడీ కూడా తమ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టారనే చెప్పాలి. ముఖ్యంగా రకుల్ తన ఫ్యాషన్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సినిమాలతో పాటు పర్సనల్ అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా దీపావళి వేడుకల్లో దిగిన ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సెలబ్రేషన్స్‌లో కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు మాత్రమే కాదండోయ్ .. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నడం విశేషం. కరణ్ జోహార్, సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా, శిల్పాశెట్టి, ట్వింకిల్ ఖన్నా, మనీష్ మల్హోత్రా వంటి స్టార్స్ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని తెలుస్తుంది.
మరోవైపు రమేష్ తౌరానీ ఏర్పాటు చేసిన దీపావళి పార్టీలో సల్మాన్ ఖాన్, బాబీ డియోల్, ఖుషీ కపూర్ తదితరులు పాల్గొని సందడి చేయడం విశేషం. ఏది ఏమైనా ఒకవైపు పండుగ ట్రెడిషన్స్ ని పాటిస్తూనే.. మరోవైపు తమ గ్లామర్, స్టైల్‌తో బాలీవుడ్ స్టార్స్ ఈ దీపావళిని మరింత సందడిగా మార్చారనే చెప్పాలి !
ALSO READ :49 ఏళ్ల సురేఖా వాణి.. యువకుడితో క్లోజ్ వీడియోలు! నిజమెంత?