Surekha Vani:టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది కూడా . ఇక ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ యాక్టివ్ గా ఉంటుంది . ముఖ్యంగా తన కూతురు సుప్రీతతో కలిసి చేసే పోస్టులకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే తాజాగా సురేఖ వాణికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొన్ని పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఒక్కసారిగా నెట్టింట్లో హాట్ డిస్కషన్ మొదలైంది.. అయితే కొద్దిసేపటికే ఆ వీడియోలు ఆమె అకౌంట్ నుంచి కనిపించకుండా పోయాయి.దీంతో అసలు ఏం జరిగిందా అంటూ అభిమానులు ఆరా తీసే పనిలో పడ్డారు. ఇక ఈ సందర్బంగా సురేఖ వాణి అసలు విషయం ఇలా చెప్పుకొచ్చింది.
తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని, అందుకే తన వ్యక్తిగత వీడియోలు బయటకు వచ్చాయని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు, ఆ వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని అభిమానులను కోరింది.ఇక . ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాకుండా వాట్సాప్, ఫేస్‌బుక్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ వాటిని సర్క్యులేట్ చేయొద్దని స్పష్టం చేసింది
తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఇలా బయటపెట్టడం, వాటిని నలుగురికీ పంపించడం వల్ల తనకు ఇబ్బంది కలుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది . తన వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇవ్వాలని , ఈ వీడియోలను కావాలని వైరల్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించింది ఈ వెటరన్ బ్యూటీ ..
సురేఖ వాణి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు కూడా . ఇలాంటి సమయంలో ఆమెకు అండగా ఉండాలని, ఎవరి వ్యక్తిగత వీడియోలను అయినా షేర్ చేయడం తప్పని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇక సురేఖ వాణి సినిమాల విషయానికి వస్తే.. రెడీ, దూకుడు, బద్రి, ఏ మాయ చేసావే, శ్రీమంతుడు, సరైనోడు, బ్రహ్మోత్సవం, రాజా ది గ్రేట్, బంగార్రాజు, భోళా శంకర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొత్తానికి సినిమాలతో, సోషల్ మీడియా పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో ఉండే సురేఖ వాణి.. ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ వ్యవహారంతో మరోసారి చర్చల్లోకి వచ్చింది.చూడాలి మరి ముందు ముందు ఈ హ్యాకింగ్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో !