E-Paper
Advertisement

Sandeep Raj: ‘కలర్ ఫోటో‘ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. ఎమోషనలైన సందీప్ రాజ్

Sandeep Raj: ‘కలర్ ఫోటో‘ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. ఎమోషనలైన సందీప్ రాజ్
Advertisement

Director Sandeep Raj About Ram Charan: ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రామ్ చరణ్. అంతకు ముందు ఏడాది రెండు మూడు సినిమాలు చేసే చరణ్.. ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ కోసం ఏకంగా మూడేళ్లు టైం ఇచ్చాడు. ఈ మూవీ ఫలితం ఏమైందో తెలిసిందే. ఆ తర్వాత బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

స్క్రిప్ట్ చెప్పమని అడిగిన చరణ్

Advertisement

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న చరణ్ చేతిలో ఒక్క సినిమానే ఉంది. దీంతో రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలో ఉన్నారు. ప్రస్తుతం గ్లోబర్ స్టార్ ఇమేజ్ ఉన్న చరణ్ ఓ చిన్న డైరెక్టర్ ని కథ చెప్పామని అడిగాడట. ఆయన మరెవరో కాదు కలర్ ఫోటో ఫేం సందీప్ రాజ్. ప్రస్తుతం యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా మోగ్లి మూవీ చేస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానళ్ కు ఇంటర్య్వూ ఇచ్చాడు.

అలా అడిగేసరికి షాక్ అయ్యా

ఈ సందర్భంగా రామ్ చరణ్ తనని స్క్రిప్ట్ రెడీ చేయమని అడిగినట్టు చెప్పాడు. అయితే ఇది ఇప్పుడు కాదని, ధృవ మూవీ టైంలోని అని స్పష్టం చేశాడు. తాజాగా ఇంటర్య్వూలో ధృవ మూవీ చేస్తున్నప్పుడు చరణ్ కలిసి సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘రామ్ చరణ్ గారిని ధృవ మూవీ టైంలో కలిశాను. అప్పటికి నేను అప్ కమ్మింగ్ డైరెక్టర్ నే. అప్పుడే నన్ను నమ్మి మంచి కథ ఉంటే చెప్పమని అడిగారు. అప్పుడే నన్ను ఓ స్టార్ హీరో నమ్మడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. రామ్ చరణ్ నన్ను స్టోరీ అడగమంటేని నమ్మలేకపోయా. స్వయంగా ఆయన నన్నే అడగడంతో పట్టరాని సంతోషంలో ‘ఉండిపోయా’ అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Also Read: Chiranjeevi: స్పిరిట్ ఓపెనింగ్ కి వెళ్లి.. చరణ్-సందీప్ ప్రాజెక్ట్ సెట్ చేశారా? మహేష్ డెవిల్ లేనట్టేనా..

మోగ్లీ ప్రమోషన్స్ తో బిజీ

కాగా సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇదే దర్శకుడిగా ఆయనకు తొలి చిత్రం కూడా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం నేషనల్ అవార్డుకు సైతం ఎన్నికవ్వడం విశేషం. తొలి చిత్రంతోనే సందీప్ రాజ్ నేషనల్ అవార్డు తీసుకుని ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆ గుర్తింపుని క్రేజ్ కంటిన్యూ చేసేందుకు స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కలర్ ఫోటో తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మోగ్లీ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యాంకర్ సుమ కనకాల తనయుడు హీరోగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదల కానుంది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×