E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రికీ పై మహా సీరియస్.. మాధవ్ కు నిజం చెప్పిన చక్రీ.. హాస్టల్ కు మహా వెళ్తుందా..?

Podarillu Today Episode : చక్రికీ పై మహా సీరియస్.. మాధవ్ కు నిజం చెప్పిన చక్రీ.. హాస్టల్ కు మహా వెళ్తుందా..?
Advertisement

Podarillu Today Episode February 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. భోజనాలు తింటూ ఒక ఆవిడ ఇంటి గురించి దారుణంగా మాట్లాడుతుంది..అది విన్న కేశవ బిర్యానీ కావాలంటే అడుగు. అంతేకానీ ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు అని అంటాడు. మీ గురించి మేము ఏమైనా మాట్లాడుతున్నామా..? ఈ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది అది తెలిసి నువ్వు పెళ్లి చేసి పంపించేసావు అది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పానని ఆమెతో అంటాడు.. ఇక కుటుంబం మొత్తం కలిసి ఫోటో దిగాలని అనుకుంటారు. అందరూ కలిసి మహాచక్రియలతో ఫోటో దిగుతారు.. ఈ ఎపిసోడ్ కి వీళ్ళ ఫోటోలు హైలెట్గా నిలుస్తాయి. గాయత్రి చక్రికి కంగ్రాట్యులేషన్స్ చెప్తుంది. మహా కి మాత్రం చెప్పడంలో కాస్త ఫీల్ అవుతుంది. ఇది విన్న మాధవ్ నువ్వు ఇలా రా వెళ్దామని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు.. గాయత్రి ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాడు మాధవ్. మా ఇంటికి బంధువు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు మాత్రమే అని భారీ డైలాగులతో గాయత్రి కి అన్నం వడ్డిస్తాడు. ఆ తర్వాత తాయారు వచ్చి గాయత్రితో గొడవపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అందరూ కలిసి ఫోటోలు దిగిన తర్వాత భోజనం చేద్దామని వస్తారు. చక్రి మహాలను కూడా మాధవ్ పిలవడంతో అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు.. మహా ఫీల్ అవుతుంటే చక్రి మాత్రం మీరు అలా ఫీల్ అవ్వకండి కాస్త ఫ్రీగా కూర్చోండి ఎలాగో ఫంక్షన్ అయిపోయింది కదా అని అంటాడు. ఇక భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు. మాధవ్ నీకంత అయిపోయిందమ్మా జరగాల్సినంత జరిగిపోయింది ఇక నిన్ను ఎవరు ఏమీ అనరు భోజనం చేయమ్మా అని అనగానే భోజనం చేస్తుంది. ఇక అందరూ కలిసి పడుకోవాలని అనుకుంటారు. లోపల మహా చూస్తే చాలా సీరియస్ గా ఉందని చక్రి అనుకుంటాడు.. లోపలికి వెళ్తే చంపేస్తుందేమో అని గుమ్మం దగ్గరే నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు..

Advertisement

అయితే అక్కడికి వచ్చిన నారాయణ చక్రిని ఒక్కసారిగా దెబ్బ కొడతాడు. ఎందుకో అంత గట్టిగా కొట్టావ్ కొట్టకుండా కూడా మాట్లాడొచ్చు కదా అనేసి నారాయణను చక్రి అడుగుతాడు. కాదురా నువ్వు చేసిన పనికి అప్రిషియేట్ చేశాను అని నారాయణ అంటాడు. అయితే ఇక్కడ మహాలక్ష్మి వింటే ఏమైనా అనుకుంటుందని నారాయణ నువ్వు బయటికి తీసుకుని వెళ్లి చక్రి మాట్లాడుతాడు… నువ్వు ఇన్నాళ్లకు మంచి పని చేశావు నాన్న మీకు బంగారం కొనేత ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి అని చక్రి అడుగుతాడు. అది డబ్బులు కదరా మీ అమ్మ తాళిబొట్టుని ఇన్నాళ్లు దాచి పెట్టాను దాన్ని అమ్మేసి కొత్త బంగారు తాడు చేపించాను అని అనగానే చక్రిచారు సంతోషంగా ఫీల్ అవుతాడు.

వీళ్ళిద్దరి మాటలు విన్న మాధవ్ వీడు మాయ చేస్తున్నాడు ఆఖరికి నాన్నను కూడా మోసం చేస్తున్నాడు అని మాధవ్ ఆలోచిస్తూ ఉంటాడు.. ఆ తర్వాత చక్రి ఒంటరిగా ఉండడం చూసిన మాధవ్ అసలు ఏం జరిగిందో చెప్పు రా అని అడుగుతాడు.. కానీ మాధవ్ మాత్రం ఎన్నిసార్లు అడిగినా కూడా చక్రి ఏది నిజం చెప్పడు.. అది అనుకోని పరిస్థితుల్లో జరిగిన పెళ్లి కాబట్టి నేనేం చెప్పలేకపోయాను అన్నయ్య. పోలీసులు పెళ్లి చేశారు అని అంటే మీరు బాధపడతారని నేను అలా చెప్పాను అంతే అంతకుమించి ఇంకేం చెప్పలేదు అని చక్రి మరో అబద్ధం చెప్తాడు.. మహాలక్ష్మిని ఇబ్బంది పెట్టాము ఇకనుంచి అయినా మంచిగా చూసుకోవాలని మాధవ్ చక్రిప్ చెప్తాడు.

Advertisement

Also Read :రాజేష్ కు మాటిచ్చిన బాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. మీనా, బాలు మధ్య గొడవ..

ఉదయం మహాలక్ష్మి లేవగానే అందరూ పడుకుని ఉండడం చూసి భయపడుతుంది.. ఆ తర్వాత నారాయణ ప్రవర్తన చూసి కంగారుపడుతుంది.. నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నన్ను హాస్టల్లో చేర్పించండి నేను వెళ్ళిపోతాను అని చక్రితో అనడం మాధవ్ వింటాడు.. ఈ ఆ తర్వాత మాధవ్ కన్నా ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి జరుగుతాయని నేను కలలో కూడా ఊహించలేదు అని కన్నా సంతోషంగా ఉంటాడు. మళ్లీ ఫంక్షన్ చేయడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మలాంటి వదిన నాకు రావడం చాలా సంతోషంగా ఉందని కన్నా ఆలోచిస్తూ ఉంటాడు కానీ మాధవ్ మాత్రం దిగులుగా ఉంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నారాయణను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×