Coolie Pre release: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజినీకాంత్ (Rajinikanth)ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కూలీ(Coolie). ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ హిందీ తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రజనీకాంత్అ, మీర్ ఖాన్ లాంటి హీరోలు మినహా మిగిలిన వారందరూ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ సినిమాలో నటుడు సత్యరాజ్(Satya Raj) కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
హీరోగా ఛాన్స్ ఇవ్వండి?
ఈయన శృతిహాసన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సత్య రాజ్ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో స్టార్ హీరోలు అందరూ నటించారని సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని తప్పకుండా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. అదేవిధంగా నెక్స్ట్ సినిమాలో లోకేష్ నన్ను హీరోగా తీసుకోండి అంటూ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఫన్ క్రియేట్ చేశారు. మరి హీరోగా ఈయనని తీసుకుంటే హీరోయిన్ గా ఎవరు కావాలని ప్రశ్న కూడా ఎదురయింది.
ట్రెండింగ్ లో మోనికా సాంగ్..
హీరోయిన్ గా శృతిహాసన్ వద్దు ఆమె నాకు కూతురు లాంటిది దీపిక పదుకొనే అయితే నా హైటుకు అనుగుణంగా సరిపోతుంది అంటూ సరదాగా మాట్లాడారు. ఈ సినిమాలో మోనిక సాంగ్(Monica) కూడా అద్భుతంగా వచ్చింది అంటూ సత్యరాజ్ మాట్లాడిన నేపథ్యంలో వెంటనే సుమ ఈ పాటకు డాన్స్ చేయాల్సిందిగా కోరారు. వెంటనే సాంగ్ ప్లే అవ్వడంతో స్టేజ్ పైనే సత్యరాజ్ మోనికా పాటకు అద్భుతమైన డాన్స్ చేశారని చెప్పాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూలి సినిమాలో ఈ పాట భారీగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే పాట మారుమోగుతుంది.
ఈ సినిమాలో నటిగా శృతిహాసన్ నటించగా స్పెషల్ సాంగ్ మాత్రం పూజా హెగ్డే(Pooja Hegde) చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇక లోకేష్ కూలీ సినిమాను హిందీ తమిళ తెలుగు కన్నడ భాషలలో విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా ఈ సినిమాలో భాగం చేశారు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శృతిహాసన్, పూజా హెగ్డే వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా అనిరుధ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని చెప్పాలి. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అదే రోజే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నిందని చెప్పాలి. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో విజయం ఎవరు అందుకుంటారో తెలియాల్సి ఉంది.
Also Read: Coolie Pre Release: నేను ముసలోడినయ్యా… నాగార్జున ఇప్పటికి మన్మధుడే..