BigTV English

Coolie Pre Release: నేను ముసలోడినయ్యా… నాగార్జున ఇప్పటికి మన్మధుడే..

Coolie Pre Release: నేను ముసలోడినయ్యా… నాగార్జున ఇప్పటికి మన్మధుడే..

Coolie Pre Release: డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth)ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కూలీ(Coolie). ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ తెలుగు తమిళ హిందీ భాషలలో ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. తాజాగా ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ లోకేష్ తో పాటు శృతిహాసన్ నాగార్జున సత్యరాజ్ వంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు.


విలన్ పాత్ర అద్భుతంగా ఉంది..

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరు కాకపోయినా ఈయన తెలుగు ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా రజనీకాంత్  తెలుగులో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ కూలీ సినిమానికి ఎంతో అద్భుతంగా తెరకేక్కించారని తెలిపారు. తెలుగులో రాజమౌళి ఎలాగో తమిళంలో లోకేష్ అలాగే అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా స్టోరీ చెప్పేటప్పుడు విలన్ పాత్ర విని నేను చాలా ఎక్సైట్ అయ్యానని తెలిపారు.


మొదటిసారి విలన్ గా నాగార్జున…

సైమన్ అనే విలన్ పాత్ర చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత ఈ పాత్రలో తెలుగు స్టార్ హీరో నాగార్జున(Nagarjuna) నటిస్తున్నారని చెప్పగానే నేను ఆశ్చర్యపోయానని తెలిపారు. నాగార్జున గారు డబ్బు కోసం ఇలాంటి పాత్రలలో నటించరని నాకు తెలుసు గత 30 సంవత్సరాలుగా తాను హీరోగా మంచి మంచి పాత్రలలో నటించి బోర్ కొట్టడం వల్లే ఇలా విలన్ గా కనిపించబోతున్నానని నాగార్జున తెలిపినట్టు రజినీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు.

నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ అదేనా?

నాగార్జున ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలాగైతే ఉన్నారో ఇప్పటికీ అలాగే, మన్మధుడిగానే ఉన్నారని నేను మాత్రం ముసలోడిని అయిపోయానని తెలిపారు. అతని సీక్రెట్ ఏంటా అని అడిగితే ఎక్సర్సైజెస్, స్విమ్మింగ్ చేస్తానని, కాస్త డైట్ ఫాలో అవుతానని మాత్రమే చెప్పారు. అలాగే నాన్నగారి జీన్స్ కూడా వచ్చాయని చెప్పినట్టు రజిని వెల్లడించారు. నాగార్జునతో కలిసి దాదాపు 15 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నానని రజనీకాంత్ నాగార్జునతో పని చేయడం గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలియజేయడమే కాకుండా సత్యరాజు, శృతిహాసన్, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి వారందరి గురించి కూడా ఈ సందర్భంగా మాట్లాడిన వీడియోని ప్లే చేశారు. అయితే రజనీకాంత్ ఈ కార్యక్రమానికి రాని నేపథ్యంలోనే ఇలా సినిమా గురించి అందరి పాత్రల గురించి మాట్లాడారని తెలుస్తుంది. కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి అదే రోజు కూడా ఎన్టీఆర్ నటించిన వార్ 2 విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది.

Also Read: Actress Ramya: నటి రమ్యకు అత్యాచార బెదిరింపులు… పోలీసుల అదుపులో ఆ హీరో ఫ్యాన్స్!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×