BigTV English

Coolie Collections : ‘కూలీ’ వీకెండ్ కలెక్షన్స్.. అక్కడ దారుణం… తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లంటే..?

Coolie Collections : ‘కూలీ’ వీకెండ్ కలెక్షన్స్.. అక్కడ దారుణం… తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లంటే..?

Coolie Collections : తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్, మాస్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కూలీ.. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలో నటించారు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మిక్స్డ్ టాక్ ను సరిపెట్టుకుంది. దాంతో కలెక్షన్లు కూడా పెద్దగా వసూలు చేయలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీకెండ్ ముగిసే సరికి ఈ మూవీ ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


దారుణంగా పడిపోయిన వీకెండ్ కలెక్షన్స్.. 

ఈ మధ్య సినిమాలు మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు యావరేజ్ టాక్ని అందుకున్న సరే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు కూలీ పరిస్థితి కూడా అంతే. పది రోజులు గడిచిపోయాయి. గతవారంతో పోలిస్తే ఈ వీకెండ్ కలెక్షన్లు పెరిగి ఉంటాయని అందరూ అనుకున్నారు. కానీ ఎవరి ఊహకు అన్నని విధంగా ఈ మూవీ వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కేవలం పది రోజుల్లోనే ఈ సినిమాకు అంచనాలు తగ్గడంతో చిత్ర యూనిట్కు షాక్ అనే చెప్పాలి.. వరల్డ్ వైడ్ గా పది రోజుల్లో ఈ చిత్రానికి 460 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, ఫుల్ రన్ లో మాత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ కి మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే 500 కోట్లు దాటితే బాగుండు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .చూడాలి చివరకు ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో..


తమిళనాట ‘కూలీ ‘ రాజీ పడిందా..? 

తమిళ హీరోల నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఆ ప్రాంతంలోని యువతకు ఎంత ఆనందమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే సినిమా మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతాల్లో హంగామాలు వేరే లెవెల్ లో ఉంటాయి. తమిళనాడు లో బయ్యర్స్ 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీకి రూ. 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 120 కోట్లు షేర్ వసూళ్లు రావాలి. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఈ చిత్రం మరో 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి.. తమిళనాడు కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్స్ వచ్చాయి. మరో రెండు వారాల్లో ఓటీటీ లోకి రాబోతుందని సమాచారం..

Related News

Madharaasi Trailer: అసలు ఇదేం ట్రైలర్ బాసు? ఏం చూసుకుని తెలుగు డైరెక్టర్స్ ని కామెంట్ చేశావు మురుగా?

Cm Revanth Reddy: కార్మికుల వ్యవహారంలో వీటిని పాటించండి… సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్

Sir Madam Movie: 100 కోట్లు మార్కెట్ సార్, ఇది కంటెంట్ కి ఉన్న పవర్

Upasana Konidela: నేను వారసత్వం వల్ల ఖాస్ కాలేదు…ఉపాసన సంచలన పోస్ట్!

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Big Stories

×