Indian Railway: భారతీయ రైల్వే రోజు రోజుకు తన పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు అందుబాటులోకి తీసుకొస్తుంది. స్వతంత్ర భారతంలో మొదటిసారిగా మిజోరాంను రైలు తాకబోతోంది. రాజధాని ఐజ్వాల్ ను దేశంలోని అన్ని ప్రాంతాలతో అనుసంధానం చేయబోతోంది.అయితే, ఈ రైలు ప్రారంభంలో ఐజ్వాల్ ను అస్సాంలోని సిల్చార్ కు కలుపుతుంది. తరువాత అక్కడి నుంచి మొత్తం దేశంతో అనుసంధానించబడుతుందని అధికారులు వెల్లడించారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రైల్వే లైన్ నిర్మాణం
ఐజ్వాల్ రైల్వే మార్గం నిర్మాణం కోసం భారతీయ రైల్వే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నది. కఠిన సమస్యలను దాటుకుంటూ ఈ మార్గాన్ని పూర్తి చేసింది. ఈ రైల్వే లైన్ కోసం 48 సొరంగాలు, 55 పెద్ద వంతెనలు, 87 చిన్న వంతెనలను నిర్మించాల్సి వచ్చింది. ఈ మార్గంలోని వంతెన నంబర్ 196 అత్యంత ఎత్తులో నిర్మించారు. ఏకంగా 104 మీటర్ల మీద ఏర్పాటు చేశారు. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎక్కువ ఎత్తు కావడం విశేషం.
సెప్టెంబర్ 13న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం
ఈ కొత్త రైల్వే లైన్ మిజోరాంను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానిస్తోంది. ఈశాన్య ప్రాంతంలో వాణిజ్యంతో పాటు పర్యాటకానికి మరితం ప్రోత్సాహాన్ని అందించనుంది. ఈ రైల్వే లైన్ సెప్టెంబర్ 13న ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. బైరాబి సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ఓపెన్ చేస్తారని మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా వెల్లడించారు.
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో..
బైరాబి సైరంగ్ రైల్వే స్టేషన్ ను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి లాల్దుహోమా చెప్పారు. ఆ తర్వాత రాజధాని ఎక్స్ ప్రెస్ సర్వీస్ కూడా ఈ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించబడుతుందన్నారు. ఈ రైలు ప్రాజెక్ట్ కేంద్రం యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో మెరుగైన కనెక్టివిటీ, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఉపయోగపడనున్నట్లు ఆయన తెలిపారు.
ట్రయల్ రన్స్ విజయవతం
ఇక మిజోరాం కొత్త రైల్వే లైన్ కు సంబంధించిన ట్రయల్ రన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ఈ రైల్వే లైన్ 48 సొరంగాలు, 142 కి పైగా వంతెనల గుండా వెళుతుందని ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కెప్టెన్ కిషోర్ శర్మ వెల్లడించారు. ఇది ఈశాన్య ప్రాంతంలో అత్యంత సవాలుతో కూడిన, సంక్లిష్టమైన రైల్వే ప్రాజెక్టులలో ఒకటి అన్నారు. ఈ లైన్ కు సంబంధించి ట్రయల్ రన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయినట్లు ఆయన వెల్లడించారు. “ఈ ప్రాజెక్ట్ కేవలం రైల్వే లైన్ మాత్రమే కాదు, భారీయ ఇంజనీరింగ్ లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి”గా శర్మ అభివర్ణించారు. ముఖ్యంగా వంతెన నెంబర్ 196 గురించి ఆయన ప్రస్తావించారు. ఇది 114 మీటర్ల ఎత్తుతో ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నట్లు వెల్లడించారు. ఇది ఆధునిక ఇంజనీరింగ్ కు గొప్ప ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
Read Also: రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ ఇన్ని రకాలుగా తెలుసుకోవచ్చా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియక…