Telugu film industry : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. సినిమాలకు సంబంధించి హీరోల రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు సక్సెస్ ఫార్ములా కూడా మారిపోయింది. ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఎన్ని సెంటర్లు ఆడింది అనే దాన్నిబట్టి ఆ సినిమా విజయానికి కొలమానం వేసేవాళ్లు.
ఈ రోజుల్లో 50 రోజులు ఒక సినిమా ఆడిన దాఖలాలు కూడా లేవు. సినిమా వచ్చిన నెల రోజుల్లో డైరెక్ట్ గా ఓటీటీకి దర్శనం ఇస్తుంది. అలానే టికెట్ రేట్లు కూడా అధికంగా ఉండడంతో థియేటర్ కు వచ్చే ఆడియన్స్ సంఖ్య కూడా తగ్గిపోయింది. ఏదో పెద్ద సినిమా విడుదల అయితే కానీ ఆడియన్స్ థియేటర్ కు రావడానికి ఇష్టపడటం లేదు. చాలామంది చెప్పినట్లు కొత్త సినిమాలను ఓటీటీలో చూస్తున్నారు. పాత సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు.
కాస్ట్యూమర్ ని కొట్టిన సెక్రటరీ
ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షూటింగ్ నిలిపివేసి సినీ కార్మికులు తమ వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో జరగవలసిన షూటింగ్స్ ని కూడా ఆపేశారు. ఒక టీవీ ప్రోగ్రాం కి సంబంధించి సత్యనారాయణ అనే వ్యక్తి షూటింగుకు హాజరయ్యాడు అని, కాస్ట్యూమర్ యూనియన్ సెక్రటరీ లొకేషన్ కు వెళ్లి తన పైన చేయి చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోలు పైన నిర్మాత Skn స్పందించారు. షూటింగ్స్ కి వెళ్లాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది వెళ్లే వాళ్ళ మీద భౌతిక దాడులు అనైతికం, శిక్షార్హం అంటూ తన రియాక్షన్ ను తెలియజేశారు నిర్మాత ఎస్ కే ఎన్.
షూటింగ్స్ కి వెళ్లాలా వద్దా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది వెళ్లే వాళ్ళ మీద భౌతిక దాడులు అనైతికం, శిక్షార్హం https://t.co/nwtZp7GMMv
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 6, 2025
ఇండస్ట్రీ పెద్దలు కూడా
మరోవైపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి వాళ్లు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక రీసెంట్ గా నిర్మాత శ్రీ కళ్యాణ్ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఈ విషయంపైనే కలిశారు. ఏదేమైనా ఒకటి రెండు రోజుల్లో దీని గురించి క్లారిటీ వస్తుంది అనేది సినీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో అఖండ 2 సినిమాకి సంబంధించి, నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ చెబుతున్నారు. అక్కడికి కూడా కొంతమంది ప్రముఖులు వెళ్లి బాలకృష్ణతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
Also Read: Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు