E-Paper
Advertisement

Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు

Mani Ratnam : ఆ టాలెంటెడ్ హీరోను పక్కన పెట్టేసిన లవ్ గురు
Advertisement

Mani Ratnam : దర్శకుడు మణిరత్నం గురించి అందరికీ విధితమే. ఒక లవ్ స్టోరీ ని అందంగా అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించడంలో మణిరత్నం ను మించిన దర్శకుడు లేరు అనడం కూడా అతిశయోక్తి లేదు. ఒకప్పుడు మణిరత్నం సినిమా అంటేనే విపరీతమైన హై ఎక్స్పెక్టేషన్ ఉండేవి. ఈ మధ్యకాలంలో ఆ హై ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా తగ్గిపోయాయి.

రీసెంట్ గా మణిరత్నం నుంచి వచ్చిన సినిమా థగ్ లైఫ్. కమలహాసన్ హీరోగా నటించారు. నాయకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను కనీసం అందుకోలేకపోయింది ఈ సినిమా. ఈ సినిమాలో శింబు ఒక కీలక పాత్రలో కనిపించారు.

Advertisement

ఆ హీరో ని పక్కన పెట్టేశారు 

ముందుగా చిన్న చిన్న పాత్రల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు నవీన్ పోలిశెట్టి. తర్వాత కొంతకాలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో బాక్సాఫీస్ కి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన జాతి రత్నాలు సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లాస్ట్ ఫిలిం మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. నవీన్ పోలిశెట్టి హీరోగా మణిరత్నం దర్శకుడుగా తెలుగులో స్ట్రైట్ ఫిలిం చేస్తారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సినిమాను శింబు హీరోగా తమిళ్లో చేస్తారు అంటూ తెలిపారు. ప్రస్తుతం ఆ సినిమా నవీన్ పోలిశెట్టి చెయ్యట్లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

నవీన్ పోలిశెట్టి ప్లేస్ లో ఆ యంగ్ హీరో 

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన మహాన్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ధ్రవ్ విక్రమ్. తండ్రి కొడుకులు నటించిన ఆ సినిమా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఆ సినిమాకి ఇప్పటికీ మంచి ప్రశంసలు దక్కుతుంటాయి. అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో ఆదిత్య వర్మ పేరుతో చేశాడు ధ్రవ్ విక్రమ్. ఇక ప్రస్తుతం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో బైసన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే మణిరత్నం దర్శకత్వంలో ధ్రవ్ విక్రమ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. థగ్ లైఫ్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కాబట్టి శింబు కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా ధ్రవ్ విక్రమ్ చేయనున్నాడు.

Also Read: C Kalyan: నిర్మాత విశ్వప్రసాద్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు – సి కళ్యాణ్

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×