Hansika Motwani: ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ తన సినిమాలతో సౌత్, నార్త్ రెండు ఇండస్ట్రీలలో సత్తా చాటింది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినిమాల్లోకి వచ్చిన హన్సిక.. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఇదేంటి హన్సిక ఇంత తొందరగా పెద్దయిందని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు హన్సిక హీరోయిన్ అవ్వడానికి ఆమె పేరెంట్స్ హార్మోన్ ఇంజక్షన్స్ చేయించారంటూ ఎన్నో రూమర్లు వినిపించాయి. అయితే ఈ రూమర్లపై హన్సిక తల్లి క్లారిటీ ఇచ్చి వాటిని కొట్టిపారేసింది. అయితే అలాంటి హన్సిక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. దానికి కారణం ఆమె విడాకులు తీసుకుంటుందనే రూమర్లే.
అయితే విడాకుల రూమర్లు పక్కన పెడితే.. తాజాగా హన్సికకు కోర్టు షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ హన్సిక కోర్టుకు ఎందుకు వెళ్ళింది అనేది చూస్తే.. హన్సిక ఫ్యామిలీ మీద. హన్సిక సోదరుడి భార్య ముస్కాన్ గృహహింస కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ ని పెళ్లి చేసుకున్న టీవీ నటి ముస్కాన్.. హన్సిక ఫ్యామిలీపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసింది. కట్టుకున్న భర్తతోపాటు అత్త, ఆడపడుచు నన్ను వేధిస్తున్నారని, వారి టార్చర్ తట్టుకోలేక నేను ఇంటి నుండి బయటకు వచ్చేసానంటూ గృహ హింస కేసు పెట్టింది. అయితే ఈ గృహ హింస కేసులో హన్సికకి, హన్సిక తల్లికి బెయిల్ వచ్చినప్పటికీ తన మీద ఉన్న కేసును పూర్తిగా కొట్టివేయాలని హన్సిక తాజాగా బాంబే సెషన్స్ కోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది.
హన్సిక పిటిషన్ కొట్టి వేసిన కోర్టు..
కానీ హన్సిక వేసిన పిటిషన్ ని కోర్టు కొట్టివేసింది. దానికి కారణం హన్సిక దాఖలు చేసిన ఆ పిటిషన్ లో బలమైన కారణాలు ఏవి లేకపోవడంతో హన్సికపై ఉన్న కేసుని కొట్టి వేయడానికి వీల్లేదని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హన్సికకు కోర్టులో షాక్ తగిలింది. ప్రస్తుతం హన్సిక సోదరుడు ప్రశాంత్, ఆయన భార్య ముస్కాన్ ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు. ఇక ఈ గృహహింస కేసుకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయితే తప్ప హన్సికకు ఈ కేసులో ఉపశమనం దొరకే ఛాన్స్ కనిపించడం లేదు.
హన్సిక వ్యక్తిగత జీవితం..
హన్సిక పర్సనల్ లైఫ్ కి వస్తే..2022లో సోహైల్ కతూరియాని పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లయిన రెండేళ్లకే భర్తకు దూరంగా ఉంటుందనే రూమర్లు వినిపిస్తున్నాయి. సోహైల్ ఉమ్మడి కుటుంబంలో ఇబ్బందులు పడి హన్సిక భర్తకి దూరంగా ఉందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అలా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వినిపించినా కూడా హన్సిక వాటిపై స్పందించడం లేదు.
హన్సిక సినిమాలు..
హన్సిక సినిమాల విషయానికి వస్తే.. ఈ హీరోయిన్ ప్రస్తుతం తమిళంలో గాంధారి, రౌడీ బేబీ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మ అందుకోలేదని చెప్పవచ్చు.
ALSO READ:Mirai: మిరాయ్ మూవీపై రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ పోస్ట్.. రూ.1000 కోట్ల క్లబ్ గ్యారెంటీ!