Director Ram Jagadeesh: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఇదివరకే సింగర్ రాహుల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక దర్శకుడు కూడా పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. మరి పెళ్లి చేసుకున్న ఆదర్శకుడు ఎవరు అంటే ఆయన మరెవరో కాదు డైరెక్టర్ రామ్ జగదీష్(Ram Jagadeesh). రామ్ జగదీష్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ కోర్టు సినిమా(Court Movie) దర్శకుడు అంటే మాత్రం టక్కున అందరికీ గుర్తుకొస్తారు.
కార్తీక మెడలో మూడు ముళ్ళు…
నాని(Nani) నిర్మాణ సారథ్యంలో ప్రియదర్శి, శ్రీదేవి, రోషన్ ప్రధాన పాత్రలలో నటించిన కోర్టు సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు రామ్ జగదీష్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి చేత ప్రశంసలు అందుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్న ఈయన తాజాగా కార్తిక (Karthika)అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
పెళ్లి పీటలెక్కిన కోర్టు డైరెక్టర్…
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా నటుడు శివాజీ కూడా పాల్గొని సందడి చేశారు. ఇలా వీరి పెళ్లి ఫోటోలను శివాజీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇద్దరు జీవితాంతం ఎంతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక దర్శకుడు రామ్ జగదీష్ వివాహం చేసుకున్న అమ్మాయి కార్తీక సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు అయితే తన కుటుంబ వివరాలు మాత్రం తెలియడం లేదు.
నాని నిర్మాణంలోనే కొత్త సినిమా..
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రామ్ జగదీష్ సినిమాల విషయానికి వస్తే ఈయన తదుపరి నాని నిర్మాణంలోనే మరో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన బోతున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతుంది. ఇక ప్రస్తుతం నాని వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరమే రామ్ జగదీష్ తో కొత్త సినిమా ప్రకటించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.
Also Read: Anchor Sreemukhi: శ్రీముఖి నాకు ద్రోహం చేసింది.. స్టేజ్ మీదే ఆమె ప్రియుడు బ్రేకప్