BigTV English

Amazon Appstore: అమెజాన్ యాప్‌స్టోర్‌కు గుడ్‌బై.. ఇకపై శాశ్వతంగా మూత.. డేట్ కూడా ఫిక్స్!

Amazon Appstore: అమెజాన్ యాప్‌స్టోర్‌కు గుడ్‌బై.. ఇకపై శాశ్వతంగా మూత.. డేట్ కూడా ఫిక్స్!

Amazon Appstore: ఒకప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌కి పోటీగా రంగంలోకి దూసుకొచ్చిన అమెజాన్ యాప్‌స్టోర్ ఇక మూతపడనుంది. దాదాపు 14 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సర్వీస్ ఆగస్టు 20, 2025న అధికారికంగా శాశ్వతంగా మూసివేయబడుతుందని అమెజాన్ ప్రకటించింది. సాధారణ అండ్రాయిడ్ వినియోగదారులకు ఇది పెద్ద షాక్ కాకపోవచ్చు. ఎందుకంటే చాలాకాలంగా వారంతా గూగుల్ ప్లే స్టోర్‌పైనే ఆధారపడుతున్నారు. అయినా ఈ నిర్ణయం కొంతమంది వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుంది, ముఖ్యంగా Amazon Coins వాడిన వారు లేదా ఆ ప్లాట్‌ఫారమ్‌ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ఇదొక బిగ్ షాక్.


యాప్‌స్టోర్ చరిత్ర..
2011లో అమెజాన్, గూగుల్ ప్లే స్టోర్‌కు పోటీగా తన అమెజాన్ యాప్ స్టోర్ ను లాంచ్ చేసింది. ఫ్రీ యాప్ ఆఫ్ ది డే, ప్రత్యేక ఆఫర్లు, అలాగే అమెజాన్ కాయిన్స్ అనే డిజిటల్ కరెన్సీని కూడా ప్రవేశపెట్టింది. ఫైర్ టాబ్లెట్లతో బండిల్ చేసి ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని కంపెనీ యోచించింది. మొదట్లో ఇది కొంత ఆసక్తి రేపినా, గూగుల్ ప్లే స్థాయికి దగ్గరగానూ చేరలేకపోయింది. డెవలపర్లు ఎక్కువగా ప్లే స్టోర్‌ను ఎంచుకోవడంతో అమెజాన్ యాప్‌స్టోర్ క్రమంగా వెనుకబడిపోయింది.

ఎందుకు మూసేస్తోంది?
తమ సొంత ఎకోసిస్టమ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నామని అమెజాన్ అంటోంది. Fire Tablets, Fire TVs వంటి డివైజ్‌లలో యాప్‌స్టోర్ యథావిధిగా కొనసాగుతుంది. కానీ సాధారణ అండ్రాయిడ్ ఫోన్లు, టాబ్లెట్లలో మాత్రం ఈ సర్వీస్‌కు ముగింపు పలుకుతోంది. ఇలా చేయడం ద్వారా నష్టాలు తగ్గించుకోవచ్చని, అలాగే Prime Video, Alexa వంటి సర్వీసులపై మరింత ఫోకస్ పెట్టవచ్చని కంపెనీ భావిస్తోంది.


వినియోగదారులకు ఏం జరుగుతుంది?
అమెజాన్ యాప్‌ స్టోర్ ద్వారా ఇప్పటివరకు డౌన్‌లోడ్ చేసిన యాప్‌లు కొన్ని డివైజ్‌లలో పనిచేయొచ్చు. కానీ వాటికి అప్‌డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లు ఇకపై రావు. దీంతో కాలక్రమేణా ఆ యాప్‌లు సరిగా పనిచేయకపోవచ్చు లేదా సెక్యూరిటీ రిస్క్ అవుతాయి.

Amazon Coins ఇక మాయం
ఒకప్పుడు ఇన్-యాప్ పర్చేస్‌ల కోసం Amazon Coins అనే డిజిటల్ కరెన్సీని ప్రారంభించింది కంపెనీ. కానీ యాప్‌స్టోర్ మూతపడుతుండటంతో ఇది కూడా పూర్తిగా ఆగిపోతుంది. ఆగస్టు 20 తర్వాత ఎవరి అకౌంట్‌లోనైనా మిగిలిన Amazon Coins ఉంటే వాటిని ఆటోమేటిక్‌గా రీఫండ్ చేస్తారు. అయితే ఒక షరతు ఉంది.. మీ పేమెంట్ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి. క్రెడిట్ కార్డ్ గడువు ముగిసినా, అకౌంట్ క్లోజ్ అయినా రీఫండ్ దొరకకపోవచ్చు. అందుకే అమెజాన్ ఇప్పటికే వినియోగదారులకు పేమెంట్ డిటైల్స్ అప్డేట్ చేయండి అని నోటిఫై చేస్తోంది.

యాప్‌స్టోర్ ఆగిపోతున్నా, అమెజాన్ మ్యూజిక్ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అండ్రాయిడ్‌లో ఫ్రీ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ మెంబర్స్‌కు యాడ్స్ లేకుండా వినే అవకాశం ఉంటే, Amazon Music Unlimitedకి సబ్‌స్క్రయిబ్ అయ్యేవారికి మరింత ఫీచర్లు లభిస్తాయి.

Also Read: Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

మీరు చేయాల్సింది ఇదే
మీరు గతంలో Amazon Appstore వాడి ఉంటే లేదా Amazon Coins కొనుగోలు చేసి ఉంటే వెంటనే మీ అకౌంట్ చెక్ చేసుకోవడం మంచిది. చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు కానీ రీఫండ్స్ వస్తున్నాయి కాబట్టి అకౌంట్‌లో లాగిన్ అయ్యి బ్యాలెన్స్, పేమెంట్ వివరాలు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. లేకపోతే రాబోయే రీఫండ్ కోల్పోయే అవకాశం ఉంటుంది.

మొత్తానికి చెప్పాలంటే, గూగుల్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెజాన్ చేసిన ప్రయత్నం ఇంతటితో ముగిసింది. ఫైర్ ఎకోసిస్టమ్‌లో మాత్రం తమ యాప్‌స్టోర్‌ను బలోపేతం చేయాలని చూస్తోంది. కానీ సాధారణ అండ్రాయిడ్ యూజర్లకు ఇకపై Amazon Appstore అనే ఆప్షన్ అందుబాటులో ఉండదు.

Related News

GST: కొత్త జీఎస్‌టీ ఎఫెక్ట్.. వీటి ధరలు బాగా తగ్గుతాయట.. అవి మాత్రం కాస్ట్లీనే!

Biggest Gold Mines: దేశంలో బయటపడుతున్న బంగారు గనులు.. ఈ ప్రాంతాల్లో టన్నుల కొద్ది పసిడి నిక్షేపాలు..

BSNL Offers: BSNL రూబీ ప్లాన్ విడుదల, జియో, ఎయిర్ టెల్ కు దబిడి దిబిడే!

AI Jobloss UBI: ఊడుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు.. ఆర్థిక పరిష్కారం సూచిస్తున్న టెక్ కంపెనీ యజమానులు

DMart Exit Check: డిమార్ట్ ఎగ్జిట్ చెక్.. బిల్ మీద స్టాంప్ ఎందుకు వేస్తారో తెలుసా?

Big Stories

×