Anchor Sreemukhi: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి (Anchor Sreemukhi)గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తన మాట తీరుతో ఆటపాటలతో, చలాకితనంతో అందరిని సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించే కార్యక్రమాలలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం(Aadivaaram With Star Maa Parivaaram) కార్యక్రమం ఒకటి. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటీనటులు పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ కార్యక్రమం 150 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇదివరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టార్ మా సీరియల్ నటీనటులు హాజరయ్యారు.
గుప్పెడంత మనసు రిషి…
తాతగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గుప్పెడంత మనసు సీరియల్ నటుడు రిషి పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గుప్పెడంత మనసు సీరియల్లో రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ్(Mukesh Goud) కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇక రిషి వసుధార జంట కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో సందడి చేసేవారు. ఇక ఈ సీరియల్ పూర్తి కావడంతో రిషి కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
బాలుకి బ్రేకప్ చెప్పిన శ్రీముఖి..
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అప్పట్లో శ్రీముఖి రిషితో కలిసి పెద్ద ఎత్తున పులిహోర వేషాలు వేశారు. ఇక ముఖేష్ గౌడ్ ఈ కార్యక్రమానికి దూరం కావడంతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ నటుడు విష్ణుకాంత్ (Vishnukanth) (బాలు) తో ఈమె ప్రేమాయణం నడుపుతూ వచ్చారు. అయితే తాజాగా 150వ ఎపిసోడ్ లో భాగంగా రిషి,బాలు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిద్దరితో శ్రీముఖి ఎప్పటిలాగే చాలా ఫన్ క్రియేట్ చేశారు. రిషి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో నీ కళ్ళముందే బాలుకి బ్రేకప్ చెప్పాలా అంటూ శ్రీముఖి అడగడంతో ఇప్పటికిప్పుడే చెప్పాలి అంటూ రిషి కండిషన్ పెడతారు.
ఇలా రిషి కండిషన్ పెట్టడంతో స్టేజ్ పైనే శ్రీముఖి గుప్పెడంత మనసు సీరియల్ నటుడు బాలుకి బ్రేకప్ (Breakup)చెబుతుంది. వెంటనే బాలు ఆల్రెడీ మీరు అతనితో బ్రేకప్ చెప్పేసే నా దగ్గరికి వచ్చారు కదా అంటూ సెటైర్ వేశారు.. గత పది నిమిషాల వరకు శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది కానీ ఆమె నాకు నమ్మకద్రోహం చేశారు అంటూ బాలు చెప్పడంతో కంగ్రాట్యులేషన్స్ అని హగ్ చేసుకుని కూడా చెప్పొచ్చని శ్రీముఖి మాట్లాడటంతో అందరూ నవ్వుకున్నారు అయితే ఇదంతా సరదాగా చేశారని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి 150 వ ఎపిసోడ్ లో సెలబ్రిటీల హంగామా ఎలా ఉందో తెలియాలి అంటే ఆదివారం ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: Parag Tyagi: చనిపోయిన భార్యకు గుర్తుగా గుండెపై అలాంటి పని చేసిన నటుడు… నిజమైన ప్రేమ అంటూ!