BigTV English

Actress Arrest: పరారీలోనే మూడేళ్లు.. హీరోయిన్‌ను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు

Actress Arrest: పరారీలోనే మూడేళ్లు.. హీరోయిన్‌ను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు

Actress Arrest: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ తమిళ్ హీరోయిన్ మీరా మిథున్ (Meera Mithun) ఇప్పుడు మరొకసారి వార్తల్లో నిలిచింది. గత మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఈమెను వెంటనే అరెస్టు చేయాలి అని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. గతంలో అరెస్ట్ అయిన ఈమె బెయిల్ మీద బయటకు వచ్చింది.అయితే ఇప్పుడు మళ్లీ ఈమెను అరెస్టు చేయాలి అని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


షెడ్యూల్డ్ కులాలపై మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు..

అసలు విషయంలోకి వెళ్తే.. 2021 లో షెడ్యూల్డ్ కులాలపై మీరా మిథున్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. ఈ వివాదంలో ఆమెతోపాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్ పై కూడా చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2022లో వీరిద్దరిని అరెస్టు చేయడం జరిగింది. కానీ బెయిల్ పై వీరిద్దరూ బయటకు వచ్చేశారు. దీనికి తోడు కేసు విచారణకు వారు సహకరించకపోవడంతో.. అరెస్టు వారెంట్ జారీ కూడా చేశారు.అప్పటి నుంచీ దాదాపు మూడు సంవత్సరాలుగా వీరు పరారీ లోనే ఉండడంతో.. పోలీసులు ఆమెను గుర్తించడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు సమాచారం.


తల్లి పిటిషన్ తో మీరా జాడ కనుక్కున్న పోలీసులు..

మూడు సంవత్సరాలుగా ఎంతో శ్రమ పడుతున్న పోలీసులకు ఆమె తల్లి క్లూ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న తన కూతురు మీరా మిథున్ ను కాపాడాలి అని , ఆమె తల్లి ఒక పిటిషన్ దాఖలు చేయగా.. దీంతో ఆమె గురించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. మీరా తల్లి పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. మీరాను రక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను గుర్తించి అక్కడున్న హోమ్ కి తరలించారు. అయితే విషయం తెలుసుకున్న చెన్నై న్యాయస్థానం.. ఆమెను అరెస్టు చేసి.. ఈ నెల 11వ తేదీన చెన్నై న్యాయస్థానంలో హాజరు పరచాలని కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

స్టార్ హీరోలపై కూడా అనుచిత వ్యాఖ్యలు..

ఇదిలా ఉండగా మీరా మిథున్ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు.. గతంలో కూడా విశాల్ (Vishal ), త్రిష (Trisha), రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay) వంటి బడా స్టార్స్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆమెను అరెస్టు చేయడానికి పోలీసులు కూడా వెళ్లడం గమనార్హం. ఇలా నిత్యం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న ఈమెను.. ఇప్పుడు ఏకంగా కోర్టు అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరి ఈనెల 11న జరగబోయే విచారణ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది అని చెప్పవచ్చు.

ALSO READ: Varshini : హైపర్ ఆదితో నాదొక స్పెషల్ రిలేషన్.. రూమర్స్ పై వర్షిణి క్లారిటీ!

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×