Anantapur News: కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువుకి నిందు నూరేళ్లు నిండాయి. ఉదయం వివాహం జరిగింది. సాయంత్రానికి వధువు ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఘటన వెనుక పేరెంట్స్ కారణమా? పోలీసులు ఏం చెబుతున్నారు? ఇప్పుడిదే ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా సోమందేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణమూర్తి-వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత. ఆమె వయస్సు 22 ఏళ్లు. పెళ్లీడు రావడంతో కుటుంబసభ్యులు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి ముందు హైదరాబాద్‌లో హర్షిత ఉద్యోగం చేస్తోంది.
కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో వివాహం నిశ్చయమైంది. వరుడు నాగేంద్ర బీఎండబ్ల్యూ కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఆగష్టు నాలుగు అనగా సోమవారం ఉదయం ఇరు కుటుంబాల పెద్దలు హర్షిత-నాగేంద్రలకు వివాహం ఘనంగా చేశారు. నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటి రాత్రి వేడుక ఏర్పాట్లు చేశారు.
తన గదిలోకి వెళ్లిన హర్షిత గది పైకప్పుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ ముహూర్తం సమయం అవుతున్నా వధువు రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. కుటుంబసభ్యులు-బంధువులు గది తలుపులు పగల గొట్టారు. అప్పటికి ఆరేసుకుని కనిపించడం తో షాకయ్యారు. వెంటనే సమీపంలోని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ALSO READ: ఇదేక్కడి అన్యాయం.. కూతురికి వైద్యం సరిగ్గా చేయలేదని
హర్షితను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అత్తవారింటికి వెళ్లాల్సిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇంతకీ హర్షిత ఆత్మహత్య వెనుక కారణాలేంటి?
హర్షితకు ఇష్టంలేని పెళ్లి చేశారా? అందుకే మొదటిరోజు కొన్ని క్షణాల ముందు ఆత్మహత్యకు పాల్పడిందా? వధువు ఎవరినైనా ప్రేమించిందా? ఇవే ప్రశ్నలు ఇరుగుపొరుగు వారిని వెంటాడుతున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. హర్షిత ఆత్మహత్య వెనుక నిజాలు సమాధి అయినట్టేనా?
కాళ్ల పారాణి ఆరకముందే నూరేళ్లు..
ఉరి వేసుకుని నవ వధువు హర్షిత ఆత్మహత్య
అనంతపురం జిల్లా సోమందేపల్లిలో విషాదం
ఉదయం పెళ్లి, రాత్రికి ఆత్మహత్య
పెళ్లికి ముందు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న హర్షిత
వరుడు నాగేంద్ర బీఎండబ్ల్యూ కంపెనీలో అకౌంటెంట్ pic.twitter.com/sdRTWUwXEV
— BIG TV Breaking News (@bigtvtelugu) August 5, 2025