Varshini : సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీలు కాస్త చనువుగా కనిపించారంటే చాలు.. వారి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తాయి. వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉన్నా సరే అవేవీ పట్టించుకోకుండా ఎఫైర్ రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక వార్తలు రోజు రోజుకి వైరల్ అవుతున్న క్రమంలో ఆ సెలబ్రిటీలు స్పందిస్తే తప్ప ఆ రూమర్స్ కి చెక్ పడదు అని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోనే హైపర్ ఆదితో వర్షిని చట్టా పట్టాలేసుకొని తిరుగుతోంది రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రముఖ యాంకర్ వర్షిని స్పందించింది. హైపర్ ఆది తో తనదొక స్పెషల్ రిలేషన్ అంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
హైపర్ ఆదితో రిలేషన్ లో ఉన్న వర్షిణి..
యంగ్ బ్యూటీ వర్షిణి (Varshini) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా మెరిసిన ఈమె జబర్దస్త్ (Jabardast) షో ద్వారా మరింత పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా హైపర్ ఆది (Hyper Aadi) తో ఈమె చేసిన స్కిట్స్ కి భారీగా టిఆర్పి రేటింగ్ వచ్చిందని చెప్పవచ్చు. అలాగే ఢీ, కామెడీ స్టార్ట్స్ వంటి షోలలో కూడా హైపర్ ఆదితో కలిసి సందడి చేసింది వర్షిణి. ఈ క్రమంలోనే ఆది ఎప్పుడూ వర్షిణి పై పంచ్ లు వేస్తూ ఉండడం.. వీరి మధ్య చనువు ఎక్కువగా ఉండడం చూసి లవ్ ట్రాక్ కొనసాగుతోందని కొంతమంది అభిప్రాయపడ్డారు . అంతేకాదు ఈ మేరకు రూమర్లు కూడా పెద్ద ఎత్తున పుట్టుకొచ్చాయి.
ఎఫైర్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన వర్షిణి..
దీనికి తోడు ఆది బర్తడే రోజున వర్షిణి ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో వర్షిణి, ఆది క్లోజ్ గా ఉండడంతో ఆ ఎఫైర్ రూమర్లు మరింత గుప్పుమన్నాయి.
ఇక వార్తలు రోజు రోజుకు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వార్తలపై వర్షిణి వివరణ ఇచ్చింది. వర్షిణి మాట్లాడుతూ..” హైపర్ ఆది పుట్టినరోజు సందర్భంగా కలిసాము. బర్తడే రోజు మాత్రమే కాదు.. ఆ రెండు రోజుల తర్వాత కూడా కలిసాము. ఆది ఒక మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళతోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. లోపల ఏమాత్రం నెగిటివ్ ఉండదు. ఇండస్ట్రీలో నాకు చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో ఆది కూడా ఒకరు.
ఆదితో నాదొక స్పెషల్ రిలేషన్ – వర్షిణి
నా ముందు ఒకలాగా నా వెనుక ఒకలాగా మాట్లాడే వాళ్ళంటే నాకసలు ఇష్టం ఉండదు. కానీ నేను లేకపోయినా ఆది నా గురించి ఏ రోజు కూడా చెడుగా మాట్లాడడు. అందుకే ఆదితో నాదొక స్పెషల్ రిలేషన్” అంటూ వర్షిణి చెప్పుకొచ్చింది మొత్తానికైతే వర్షిణి , ఆది మధ్య ఉన్న ఎఫైర్ రూమర్లకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చింది వర్షిణి. మరి ఇకనైనా ఈ రూమర్స్ కి చెక్ పడతాయేమో చూడాలి.
Also read: Jobs in Tollywood : సమ్మె ఎఫెక్ట్… టాలీవుడ్‌లో భారీ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది..