BigTV English

Sridevi Apalla : లగ్జరీ కారును కొన్న ‘కోర్ట్‌’ హీరోయిన్.. ధర ఎంతో తెలుసా..?

Sridevi Apalla : లగ్జరీ కారును కొన్న ‘కోర్ట్‌’ హీరోయిన్.. ధర ఎంతో తెలుసా..?

Sridevi Apalla : ఈమధ్య హీరోయిన్లు చేసింది ఒక్క సినిమా అయినా సరే లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారు. చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాకుండా సినిమా హిట్ అయితే మాత్రం తమ లైఫ్ స్టైల్ ని పూర్తిగా మార్చేస్తున్నారు. కొందరు విల్లాలు ఆస్తులు కొంటే, మరికొందరు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. రీసెంట్ టాలీవుడ్ హీరో నాని నిర్మించిన కోర్ట్ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రీదేవి.. ఈ సినిమాలో ‘జాబిలి’ పాత్రలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్‌ అయిపోయింది.. తాజాగా ఈ అమ్మడు కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..


శ్రీదేవి కొన్న కారు ఎంతంటే..?

కుర్రకారును కట్టిపడేస్తున్న హీరోయిన్ శ్రీదేవి కోరికను బయటపెట్టేసింది. ఖరీదైన కారును కొనడం తన కోరిక అంటూ.. ఎంజీ హెక్టార్‌ కారును శ్రీదేవి పోస్ట్‌ చేసింది. కాగా, ఈ లగ్జరీ కారు ధర రూ. 25 లక్షల వరకు వుంటుందని సమాచారం.. అతి చిన్న వయసులోనే తన కోరికను నెరవేర్చుకోవడంపై నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కోర్ట్ మూవీ కి గాను ఈ అమ్మడు దాదాపు పది లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ని తీసుకుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం ఈమె నటనకు ఇంకాస్త ఎక్కువ ఇచ్చిన పర్వాలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో శ్రీదేవికి ఫాలోవర్స్ బాగా పెరిగినట్లు తెలుస్తుంది..


Also Read :రూటు మార్చిన ‘కుబేర’ డైరెక్టర్.. ఆ హీరోయిన్ తో మూవీ..?

శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు.. 

ఈ కుర్ర హీరోయిన్ అసలు పేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. ‘కోర్ట్’ మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ ను చూసి ఆ క్యారక్టర్ కు ఆమె సెట్ అవుతుందని ఫిక్స్ అయ్యాడు. ఆమె అడ్రస్ను కనుక్కొని పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్‌ పూర్తి చేసింది. అమ్మానాన్నలిద్దరూ రియల్‌ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. సినిమాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ తోనే ఆమె రీల్స్ ఎక్కువగా చేస్తుందని ఇంటర్వ్యూలో చెప్పింది.. ఏది ఏమైనా కూడా మొదటి సినిమాతోనే ఇంత క్రేజ్ ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు.. ఇక నెక్స్ట్ ఏ హీరో తో సినిమా చేస్తుందో చూడాలి.. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈమె క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

Related News

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Big Stories

×