Sekar khammula: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇటీవల కుబేర సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.. ఈమధ్య ఈయన నుంచి వస్తున్న సినిమాలు కోట్లు రాబట్టకపోయినా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కుబేర సినిమా రన్ అవుతుంది.. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ ఏ హీరోతో హీరో ఇంత సినిమా చేస్తాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఈసారి హీరో కాకుండా హీరోయిన్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట డైరెక్టర్. మరి ఆయన కథకు సెట్ అయ్యే ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ..
శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి.. ఒక్కో సినిమాతో ఒక్కో విధమైన మెసేజ్ ను ప్రేక్షకులకు అందిస్తాడు. గతంలో ఎక్కువగా లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించాడు. కానీ ఇప్పుడు మాత్రం సమాజానికి పనికొచ్చే మెసేజ్ లు ఇస్తున్నాడని అర్థమవుతుంది. కుబేర మూవీతో అది కన్ఫామ్ అయ్యింది. రెగ్యులర్ గా మాస్ సినిమాలు, యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ సినిమాలు చూసే ఆడియన్స్ కు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చే ఆయన సినిమాలు మంచి రిలీఫ్ ను ఇస్తాయి. కుబేర తర్వాత ఆయన ఎవరితో సినిమా చేస్తారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ సినిమా కోసం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ సారి స్టార్ హీరోయిన్ తో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట.. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు సమంత..
సామ్ తో శేఖర్ కమ్ముల మూవీ..
కుబేర మూవీ తర్వాత డైరెక్టర్ రూటుమార్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఆ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించనున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఈ మూవీ పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ అమ్మడు అన్ని రకాల జానర్లను చేయగల సమంత ఇప్పటికే పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్, మా ఇంటి బంగారం అనే సినిమాలలో సమంత నటిస్తుంది. శేఖర్ కమ్ముల సమంతతో ఎలాంటి స్టోరీ తో సినిమా చేస్తాడో చూడాలి..
Also Read:ఇవాళ ఓటీటీలో 13 సినిమాలు.. 10 ఇంట్రెస్టింగ్ మూవీస్.. ఎక్కడ చూడాలంటే..?
ఇటీవలే మయోసైటీస్ నుంచి బయట పడ్డ సమంత వరసగా సినిమాల చేసేందుకు రెడీ అవుతుంది. అయితే ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు చేసింది. ఈమధ్య తెలుగు సినిమాలంటే ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదని తెలుస్తుంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న ఈ ఆమె తెలుగులో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవలే కొత్త నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన సమంత వరుసగా సినిమాలను నిర్మించేందుకు కూడా రెడీ అవుతుంది.