Beetroot Face Pack: ప్రకాశవంతమైన, ఆరోగ్యకరమైన చర్మం కోసం చాలామంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వాడుతుంటారు. అయితే.. మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అలాంటి వాటిల్లో బీట్‌రూట్ ఒకటి. బీట్‌రూట్ కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి.
మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీట్ రూట్ తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని ఎలా వాడాలనే విషయాలను గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌తో కలిగే ప్రయోజనాలు:
సహజమైన మెరుపు: బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి, చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి.
మచ్చలు, మొటిమల నివారణ: బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను కూడా తగ్గిస్తుంది.
చర్మానికి తేమ: బీట్‌రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని డ్రై అవ్వకుండా, తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
డెడ్ స్కిన్ సెల్స్ తొలగింపు: బీట్‌రూట్‌తో కలిపి చేసే కొన్ని ప్యాక్‌లు చనిపోయిన చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.
వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది: బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ఛాయలు (ముడతలు, సన్నని గీతలు) రాకుండా నిరోధిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.
నల్లని వలయాలు తగ్గుతాయి: కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించడంలో బీట్‌రూట్ సహాయపడుతుంది.
మెరిసే చర్మం కోసం బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌లు:
ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోగలిగే కొన్ని బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌లు:
1. బీట్‌రూట్, అలోవెరా జెల్ ప్యాక్ :
మీ చర్మం నిర్జీవంగా, పొడిగా ఉన్నట్లయితే ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది.
కావాల్సినవి: 2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసం, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్.
తయారీ విధానం: బీట్‌రూట్ రసం, అలోవెరా జెల్ కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 10-15 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మానికి తేమను అందించి, మచ్చలను తగ్గిస్తుంది.
2. బీట్‌రూట్, పెరుగు ప్యాక్:
ఈ ప్యాక్ మృత చర్మ కణాలను తొలగించి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
కావాల్సినవి: 1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ పేస్ట్ (లేదా రసం), 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు.
తయారీ విధానం: ఒక గిన్నెలో బీట్‌రూట్ పేస్ట్, పెరుగు వేసి బాగా కలపండి. తర్వాత ప్యాక్‌ను ముఖానికి, మెడకు అప్లై చేసి 10-15 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత మృదువుగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో కడిగేయండి. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
3. బీట్‌రూట్, ముల్తానీ మట్టి ప్యాక్:
జిడ్డు చర్మం ఉన్నవారికి, చర్మాన్ని కాంతివంతం చేయడానికి :
కావాల్సినవి: 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, 1-2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసం. (అవసరమైతే కొద్దిగా రోజ్ వాటర్ లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు)
తయారీ విధానం: అన్ని పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ను ముఖానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
4. బీట్‌రూట్, తేనె ప్యాక్ :
ఈ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుతుంది.
కావాల్సినవి: 1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ రసం, 1 టీస్పూన్ తేనె.
తయారీ విధానం: రెండింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేయండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయండి.
Also Read: అలోవెరా ఫేస్ మాస్క్.. ఇలా వాడితే గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ !
కొన్ని ముఖ్యమైన చిట్కాలు:
ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ప్యాక్ వేసుకునే ముందు మీ మెడ లేదా చెవి వెనుక చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ముఖ్యంగా మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి .
ఈ ప్యాక్‌లను వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగించవచ్చు.
ప్యాక్ తొలగించిన తర్వాత మీ చర్మానికి సరిపోయే మంచి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
బీట్‌రూట్ ఫేస్ ప్యాక్‌లు సహజసిద్ధంగా చర్మాన్ని కాంతివంతం చేయడానికి.. ఆరోగ్యంగా ఉంచడానికి అద్భుతమైన మార్గం. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా మెరిసే చర్మాన్ని పొందవచ్చు.