Samantha -Raj Nidumori: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ముంబైకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. సమంత ప్రస్తుతం సినిమాల పట్ల కాకుండా కేవలం వెబ్ సిరీస్ ల పైన మాత్రమే ఫోకస్ చేస్తూ పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంత తరచూ వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈమె నాగచైతన్య (Nagachaitanya)తో విడాకులు(Divorce) తీసుకొని విడిపోయిన తర్వాత మరొక దర్శకుడు రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో కలిసి కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
సమంత ఇటీవల కాలంలో ఒంటరిగా కనిపించిన దాఖలాలు లేవు ఎక్కడికి వెళ్ళినా డైరెక్టర్ రాజ్ తో పాటు కనిపించడంతో వీరిద్దరి రిలేషన్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం కూడా జరుపుకున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరిద్దరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ ఇద్దరు తరచూ జంటగా కనిపించడం, వీరి గురించి వచ్చిన రూమర్లను ఖండించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఒకే కారులో సమంత, రాజ్…
ఈ జంట ఇటీవల విదేశాలలో చాలా చనువుగా ఉంటూ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి ఇద్దరు జంటగా కెమెరా కంటికి చిక్కారు. ముంబైలో సమంత రాజ్ ఇద్దరు కలిసి జిమ్ కి వెళ్లి వర్క్ అవుట్ చేస్తూ జంటగా బయటకు రావడమే కాకుండా ఒకే కారులో వెళ్లిపోవడంతో మరోసారి ఈ వీడియో వైరల్ అవుతుంది.. ఇలా తరచూ వీరిద్దరూ జంటగా కనిపించడం, వీరి రిలేషన్ గురించి రూమర్లు వస్తున్న నేపథ్యంలో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.. ఇలా తరచూ వార్తల్లో నిలవడం కంటే ఆ రిలేషన్ ఏదో కన్ఫర్మ్ చేయొచ్చు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
?igsh=OWMwMnV4Mnd6aGQ2
దర్శకుడు రాజ్ ఇదివరకే వివాహం చేసుకొని తన భార్యకు విడాకులు ఇచ్చారు. మరో వైపు సమంత కూడా నాగచైతన్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్న నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కూడా డైరెక్టర్ రాజ్ అంటూ గతంలో వార్తలు వినిపించాయి. వీరిద్దరి మధ్య ది ఫ్యామిలీ మెన్ 2 సమయంలో పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతోనే చైతన్య సమంత మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ జంటగా కనిపించడంతో ఇదే నిజమని అందరూ భావిస్తున్నారు.. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య మరొక నటి శోభితను వివాహం చేసుకొని తన జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Katrina Kaif: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన కత్రినా దంపతులు.. కొత్త అధ్యాయం ప్రారంభం అంటూ!