Amala Akkineni: అమల అక్కినేని(Amala Akkineni) ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక అమల ఏ చిన్న విషయం మాట్లాడిన లేదా సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈమె తన ఇద్దరి కోడళ్ళు గురించి మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల నాగచైతన్య శోభితను రెండవ వివాహం చేసుకున్నారు. అనంతరం అఖిల్, జైనాబ్ వివాహం కూడా ఈ ఏడాది మార్చి నెలలో ఎంతో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
తన ఇంట్లోకి ఇద్దరు కొత్త కోడళ్లు అడుగుపెట్టడంతో వారి గురించి అమల మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నాకు చాలా అద్భుతమైన కోడళ్ళు దొరికారు. వాళ్ళిద్దరూ చాలా సరదాగా ఉంటారని వాళ్లు వచ్చిన తర్వాత మా ఇంట్లో నాకు గర్ల్స్ సర్కిల్ కూడా పెరిగిందని తెలిపారు. సమయం దొరికినప్పుడు అందరూ కలిసే ఉంటామని వారితో గడపడం చాలా సరదాగా ఉంటుందని అమల తన కోడళ్ళు గురించి ఎంతో గొప్పగా వర్ణించారు.. అదేవిధంగా అందరిలాగా నేను డిమాండ్ చేసే అత్తను కూడా కాదని, అలాగని డిమాండ్ చేసే భార్యను కూడా కాదంటూ తెలిపారు. నా ఇద్దరు కొడుకులు కూడా చాలా అద్భుతంగా పెరిగారని అమల ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అమల మొదటిసారి తన ఇద్దరి కోడళ్ళు గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం ఈ విషయంపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం అమల అనే వాదన కూడా ఒకానొక సమయంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన అనంతరం చైతన్య శోభితను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరి అక్కినేని వారసులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
సినిమాల విషయానికి వస్తే..
ఇక సినిమాల విషయానికి వస్తే నాగార్జున త్వరలోనే తన 100 వ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నాగచైతన్య కార్తీక్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అఖిల్ కూడా లెనిన్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఇండస్ట్రీ సమాచారం. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అఖిల్ అభిమానులు లెనిన్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. మరి అయ్యగారు ఈ సినిమాతో అయిన హిట్ కొడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!