Garib Rath Express: పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానా నుంచి ఢిల్లీ వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.30 గంటలకు పంజాబ్ చేరుకోగా.. పంజాబ్ సిర్హింద్ జంక్షన్ సమీపంలో ట్రైన్ ఏసీ బోగిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ట్రైన్ ఆపి.. ప్రయాణికులను కిందికి దించారు. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని రైల్వే శాఖ ప్రకటించింది.