Devisri Prasad: సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య రిలీజ్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలకు ఈయన అదిరిపోయే మ్యూజిక్ ని అందిస్తున్నాడు. కంపోజ్ చేసిన మ్యూజిక్ తో పాటుగా తాను పాడిన పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే చెవులు కోసుకునే అభిమానులు కూడా ఉన్నారు. అంతగా ఆయన సంగీతంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్ గా తన సత్తాని చాటిన దేవి ఇప్పుడు హీరోగా ఏంట్రీ ఇవ్వబోతున్నారు అన్న విషయం తెలిసిందే.. బలగం సినిమాతో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న జబర్దస్త్ వేణు దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో ఈయన నటించబోతున్నట్లు తెలిసిందే.. గత కొన్ని నెలలుగా ఈ సినిమాకు చాలామంది హీరోలను సెలెక్ట్ చేశారు. కానీ కొన్ని కారణాలవల్ల వారందరూ రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ హీరోగా చేస్తున్నాడు. అయితే ఆయనకు జోడిగా ఏ హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తారా అన్న ఆసక్తి నెలకొంది. తాజాగా హీరోయిన్ ఫిక్స్ చేసినట్లు మరో వార్త సంచలనంగా మారింది. కాస్త వివరాల్లోకి వెళితే..
గత ఏడాది బలగం సినిమాతో డైరెక్టర్ గా మారాడు జబర్దస్త్ వేణు.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డైరెక్టర్గా వేణు మొదటి సినిమాతోనే సత్తాని చాటుకున్నాడు. ఆయన రెండో సినిమాగా ఎల్లమ్మ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ హీరో విషయంలో సందిగ్ధత నెలకొంది.. హీరో ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కొందరు స్టార్ హీరోలు ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. దాంతో ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ ని సెలెక్ట్ చేశారు. ఈ సినిమాకి హీరోయిన్గా పలువురి పేర్లు తెరపై వినిపించాయి కానీ ప్రస్తుతం సినిమాని ఫిక్స్ చేసినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలో హీరోయిన్గా కీర్తి సురేష్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణంలో కీర్తి సురేష్ ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసి ఉంది. అందులో హీరోయిన్‌గా కీర్తి నటిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ‘ఎల్లమ్మ’ సినిమాలోనూ ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు..
Also Read : కొడుకుల కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. నర్మదతో సాగర్ గొడవ.. ప్రేమకు గుడ్ న్యూస్..
బలగం వేణు దర్శకత్వం, దిల్ రాజు బ్యానర్ పై ఎల్లమ్మ మూవీ రాబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే హీరో సెలెక్ట్ అవ్వకపోవడంతో సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. దాంతో ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని వేణు అతన్ని సెలెక్ట్ చేసుకున్నారు. గతంలో ఈ మ్యూజిక్ డైరెక్టర్ని హీరోగా పెట్టి సినిమా చేయాలని చాలామంది డైరెక్టర్లు అనుకున్నారు. కానీ కుదరలేదు. చివరకు వేణు ఆయన్ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇటీవల ‘ఎల్లమ్మ’ కథని ఆయన విన్నారట. కథ నచ్చడంతో అంగీకారం తెలిపినట్లు తెలిసింది.. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం.