Virat Kohli: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Ind Vs Aus )మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అది కూడా పాకిస్తాన్ జెర్సీ పై ఆటోగ్రాఫ్ ఇచ్చి వివాదంలో ఇరుక్కున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వన్డే సిరీస్ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు టీమిండియా బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే పెర్త్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లను చూసేందుకు అక్కడి ఇండియన్స్ ఎగబడ్డారు. ఇందులో భాగంగానే కొంత మంది ఆటోగ్రాఫ్ లు కూడా తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఓ అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే ఆ అభిమాని చేతిలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన జెర్సీ ఉందని, దానిపైన విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడని అంటున్నారు. దానికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ చేస్తున్నారు.
పాకిస్తాన్ జెర్సీ పైన విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అదంతా ఫేక్ అని, విరాట్ కోహ్లీ సోషల్ మీడియా టీం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు అసలు వీడియో బయట పెట్టింది. వాస్తవానికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన జెర్సీపై ఆటోగ్రాఫ్ ఇచ్చాడట విరాట్ కోహ్లీ. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జెర్సీని కాస్త పాకిస్తాన్ జెర్సీగా మార్చేశారు. అంటే ఆర్సిబి జెర్సీని మార్ఫింగ్ చేసి పాకిస్తాన్ జెర్సీగా చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ జెర్సీపై విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు కొంత మంది నెగిటివ్ ప్రచారం చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. చివరికి విరాట్ కోహ్లీ సోషల్ మీడియా టీం దీనిపై క్లారిటీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అయితే ఫోటో మార్కింగ్ చేసిన వారిపై విరాట్ కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అంటే పడని వాళ్ళు ఈ పని చేసి ఉంటారని మండిపడుతున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) త్వరలోనే రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిడియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత విరాట్ కోహ్లీ ముగుస్తుందని కూడా ప్రచారం చేస్తున్నారు. 2027 వరకు ఆడతాడు అనుకుంటే మధ్యలోనే రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. వన్డే తో పాటు ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ఇస్తాడట. ఈ మేరకు ఇప్పటికే విరాట్ కోహ్లీ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Here is the original Video.
He gave an autograph on RCB and Indian Jersey. #ViratKohli𓃵 https://t.co/BMgocdbHo0 pic.twitter.com/coMS9Od5wv— Gaurav Mishra🇮🇳 (@Gaurav_5599) October 16, 2025