Rashmika Mandanna:నేషనల్ క్రష్ .. రష్మిక మందన్న (Rashmika Mandanna) కు ఏ సమయంలో ఈ పేరు పెట్టారో తెలియదు కానీ ఆ పేరుకు తగ్గట్టుగానే అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. వరుస విజయాలతో సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా హీరో, హీరోయిన్స్ అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కన్నడ బ్యూటీ అయిన ఈమె ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు (Maheh babu) హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇకపోతే ఇలా వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈమె.. ఇప్పుడు మరింత జోరు పెంచిందని చెప్పాలి.కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రెండు సినిమాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది రష్మిక. మరి రష్మిక నటించిన ఏ రెండు చిత్రాలు.. థియేటర్లలోకి ఎప్పుడు రాబోతున్నాయి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే.. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, థామా, మైసా , కాంచన 4 అంటూ పలు చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో రెండు చిత్రాలు ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్నాయి. రష్మిక కేవలం రెండు వారాల వ్యవధిలోనే రెండు విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో మొదటి చిత్రం ఆయుష్మాన్ ఖురానాతో నటించిన హారర్ కామెడీ ‘థామా’.. అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతోంది. ఇందులో రష్మిక బేతాళ ప్రపంచానికి సుందరిగా కనిపించడం గమనార్హం. మరొక చిత్రం సమంత (Samantha) స్నేహితుడు, ప్రముఖ నటుడు , దర్శకుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వం వహించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో రష్మిక చాలా అమాయకపు అమ్మాయి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. ఇలా కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఏకంగా రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది రష్మిక మందన్న. మరి ఈ రెండు చిత్రాలలో ఏ చిత్రం ఈమెకు మంచి సక్సెస్ అందిస్తుందో చూడాలి.
ALSO READ:Dangal: ఏడడుగులు వేసిన అమీర్ ఖాన్ కూతురు.. ఫోటోలో వైరల్!
పుష్ప సినిమా అందించిన విజయంతో మళ్ళీ వెనుతిరిగి చూసుకోలేదు. అలా పుష్ప 2, ఛావా, యానిమల్ చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 3ఏళ్ల వ్యవధిలోనే 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇలా వరుస విజయాలతో.. వరుస సినిమాలతో బిజీ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.