Mohan Babu : సరైనా హిట్స్ లేక తెలుగు చిత్ర పరిశ్రమకు ఇప్పటికే అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. హై రెమ్యూనరేషన్స్ – లో కలెక్షన్స్‌తో ఇండస్ట్రీలో సంక్షోభం ఏర్పడింది. ఇది ఇలా ఉండగానే… ఇప్పుడు ఇండస్ట్రీ తలపై సమ్మె పేరుతో మరో పిడుగు పడింది. తమకు 30 శాతం వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన మాత్రమే కాదు… వాళ్లు సమ్మె బాట కూడా పట్టారు.
సినీ కార్మికులు సమ్మె దిగడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ అన్నీ కూడా బంద్ అయ్యాయి. ఇటు నిర్మాతలు వేతనాలపు ఉండబోదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. రెండు వర్గాలు మొండీగా ఉండటంతో సమస్య ఇంకా పెద్దది అవుతుంది.
ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇండస్ట్రీలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కానీ, వాటిని పరిష్కరించే వారే కరువయ్యారు. ఇండస్ట్రీలో ఉంటే స్టార్లు అందరూ, ఇండస్ట్రీని కాపాడే వారు అందరు కూడా మౌనం గానే ఉంటున్నారు. సమస్యను పరిష్కరించే ఇండస్ట్రీ పెద్ద లేకపోవడంతో సంక్షోభం ఇంకా ముదురుతుంది.
ఈ తరుణంలో పాత రోజులను గుర్తు చేసుకుంటున్నారు సినిమా అభిమానులు. గతంలో ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా… ముందుకు వచ్చి, ఎవరికీ నష్టం కలగకుండా పరిష్కరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే… అందరూ ముక్తం కంఠంతో దాసరి నారాయణరావు పేరు చెబుతారు. ఇప్పుడు ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది.
అయితే ఆయన లేకపోతేనేం.. ఆయన శిష్యుడు ఉన్నాడు కదా అని హోప్ పెట్టుకున్నారు కొంత మంది. ఆయన శిష్యుడు అంటే మంచు మోహన్ బాబు.
దాసరి నారాయణరావు శిష్యుడు తానే అని మంచు మోహన్ బాబు కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు.. ఇండస్ట్రీ మొత్తం కూడా అలానే నమ్ముతుంది.
కానీ, ఆ పెద్దాయన శిష్యుడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇండస్ట్రీలో ఇన్ని వివాదాలు పుట్టుకువస్తే.. ఎక్కడో నగర చివర ఉండి మౌనం పాటిస్తున్నాడు. ఒక్క మాటతో ఇండస్ట్రీ సంక్షోభాన్ని తరమివేసే సత్తా ఉన్న వ్యక్తి మోహన్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కానీ, ఇప్పుడు ఆయన సుప్తావస్థ కాలంలో ఉన్నట్టు ఉన్నారు. ఇండస్ట్రీలో ఇన్ని సమస్యలు వచ్చినా… ఆయనలో చలనం లేకపోవడం కొంతమంది నమ్మకలేపోతున్నారు.
మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు MAA ప్రెసిడింట్. అలాంటి టైంలో ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనపై మరింత ఉంది. కానీ, మోహన్ బాబు మాత్రం అన్నింటినీ మరిచి… ఆయన నివాసం నుంచి బయటికి రావడం లేదు.
ఎక్కడో సిటీ అవుట్ కట్స్‌లో ఉంటే, ఇక్కడ ఇండస్ట్రీలో జరిగేవి కనిపించడం లేదా ? వినిపించడం లేదా ? అని అంటున్నారు కొంతమంది. నగరానికే కాదు.. ఇండస్ట్రీకి కూడా ఆయన దూరం అయిపోయారు అనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పుడైనా.. దాసరి గారి శిష్యుడు మంచు మోహన్ బాబు ఆ నగరం చివర నుంచి నగరం నడిఒడ్డుపైకి రావాలని, ఇండస్ట్రీలో పేరుకుపోతున్న సమస్యల అన్నింటినీ పరిష్కరించి… టాలీవుడ్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కాకపోతే, ఆయన బయటికి రాగలరా…?