Gautam Gambhir : ఇంగ్లాండ్ తో జరిగిన ఓవల్ టెస్ట్ లో టీమిండియా ఉత్కంఠ పోరులో 6 పరుగులతో తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ విక్టరీ కొట్టిన టీమిండియా.. ఆ సిరీస్ ను డ్రా చేసుకుంది. అయితే ఓవల్ టెస్ట్ చివరి రోజు మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్ స్టార్ బౌలర్ సిరాజ్ సెన్షేషన్ క్రియేట్ చేసి ఇండియాకి విక్టరీని అందించాడు. తీవ్ర టెన్షన్ పుట్టించిన ఆ మ్యాచ్ ను.. భారత కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర టీమిండియా సభ్యులు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మ్యాచ్ ని వీక్షించారు. చివర్లో వికెట్లు పడుతున్న సమయంలో.. కోచ్ లు ఫుల్ టెన్షన్ గా ఫీల్ అయ్యారు. గంభీర్ తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ కూడా ఈ సందర్భంలో ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఇంగ్లాండ్ బ్యాటర్ గస్ అట్కిన్సన్ వికెట్ తీసిన తరువాత డ్రెస్సింగ్ రూమ్ లో సంబురాలు ఆకాశాన్ని అంటాయి.
Also Read : Mohammad Siraj : మహమ్మద్ సిరాజ్ మొబైల్ ఫోన్ వాల్ పేపర్ లో ఎవరున్నారో తెలుసా
డ్రెస్సింగ్ రూమ్ లో గంభీర్
మామూలుగా గౌతమ్ గంభీర్ ఎప్పుడూ నవ్విన సందర్భాలు ఉండవు. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే నవ్వుతాడు. ఆయన స్మైల్ ఇచ్చే సందర్భాలు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఓవల్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన క్షణంలో అతను సెలబ్రేట్ చేసుకున్న తీరు ఉద్విగ్నభరితం. అతని కండ్లలో కన్నీళ్లు ఆగలేదు. ఇక ఆనందం పట్టలేక గంభీర్ గంతులేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ మీదకు జంప్ చేసి హత్తుకున్నాడు. గట్టిగా అరుస్తూ ఆ విక్టరీని అస్వాదించాడు. కండ్లు ఆనందభాస్పాలతో నిండిపోయాయి. అయితే డ్రెస్సింగ్ రూమ్ ఎమోషన్స్ కు చెందిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో సిరాజ్ ట్రెండింగ్
ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 2-2 తో సమానం అయింది. ఈ సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు కైవసం చేసుకుంటుందని చివరి వరకు అంతా అనుకున్నారు. నిన్న 35 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో మ్యాచ్ ని ముగించారు. అప్పటికీ 6 వికెట్లు ఉన్నాయి. కానీ ఇంగ్లాండ్ జట్టు ఇవాళ వరుసగా వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా టీమిండియా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా ని విజయం వరించింది. మరోవైపు కొన్ని క్యాచ్ లు, ఫీల్డింగ్ లో కూడా పొరపాట్లు చేసింది టీమిండియా.. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే తన సంచలన బౌలింగ్ తో భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు సిరాజ్. ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ క్రమంలో సిరాజ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. సిరాజ్ ఇప్పటి వరకు ఇంగ్లాండులో 46 టెస్టు వికెట్లు సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. ఆ రికార్డు బ్రేక్ అయింది. ప్రస్తుతం సిరాజ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
To those who were praying for his downfall — pray harder, because Gambhir will always have the last laugh 💜 pic.twitter.com/GZbReSVvyC
— KKR Karavan (@KkrKaravan) August 5, 2025