BigTV English
Advertisement

Mirai vs Kishkindhapuri: లెక్కలు మారుతున్నాయి… ఈ వీకెండ్ ఏం జరుగుతుందో ?

Mirai vs Kishkindhapuri: లెక్కలు మారుతున్నాయి… ఈ వీకెండ్ ఏం జరుగుతుందో ?


Mirai vs Kishkindhapuri: గత వారం రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి కిష్కంధపురి, మిరాయ్. మొదట్లో కిష్కంధపురికి మిక్సిడ్ టాక్ వచ్చింది. ఇక మిరాయ్‌కి క్లీన్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్షోతో సినిమా హిట్టాక్తెచ్చుకుంది. దీంతో ఆడియన్స్అంతా మిరాయ్ వైపే చూశారు. కానీ, సడన్‌గా ఆడియన్స్యూటర్స్తీసుకుని కిష్కంధపురికి మూవీ వైపు తిరిగారు. దీంతో బాక్సాఫీసు మిరాయ్వర్సెస్కిష్కింధపురి అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఈ వీకెండ్ ఈ రెండు సినిమాలకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, రాబోయే వారం ఓజీ వస్తుంది. ఓజీ వచ్చిందంటే… అన్నీ సినిమాలకు ఫుల్స్టాప్ పడినట్టే. మరి ఈ వీకెండ్ ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి అనేది ఓ లుక్కేయండి!

మిరాయ్ హిట్.. కిష్కింధపురికి డివైడ్

మిరాయ్ చిత్రానికి డే 1 నుంచి క్లీన్ పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా చాలా తక్కువ బడ్జెట్‌తో హై గ్రాఫిక్స్ ఉన్న మూవీని తీశారు అని క్రిటిక్స్ అందరూ సినిమాను పొగిడేశారు. దీంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్‌కు క్యూ కట్టారు. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చాలా రోజుల తర్వాత, చాలా డిజాస్టర్లు అందుకున్న తర్వాత ఈ సినిమాతో క్లీన్ హిట్ దొరికింది. అందరూ హ్యాపీనే. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని, హీరో తేజ సజ్జకు కాస్ట్లీ కారు కూడా గిఫ్ట్ ఇస్తా అని మాటిచ్చాడు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.


మిరాయ్ కి పోటిగా కిష్కింధపూరి

అయితే ఈ మూవీ ఎప్పుడు ఏం చేయాలన్నా… ఈ రెండు రోజులు మాత్రమే. ఈ రోజు, రేపటితో మిరాయ్ థియేట్రికల్ రన్ దాదాపు క్లోజ్ అయినట్టే. ఎందుకంటే అక్కడ వచ్చేది ఓజీ. థియేటర్స్ అన్నీ ఆ మూవీనే ఆక్యూపై చేసుకుంటుంది. అయితే ఈ మూవీకి కిష్కంధపురి టఫ్ ఫైట్ ఇవ్వొచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కిష్కంధపురి సినిమాకు డే 1 ఇలాంటి టాక్ లేదు. మిక్సిడ్ టాక్ వచ్చింది. కానీ, ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవితో పాటు చాలా మంది ఈ సినిమాపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

దానికి కిష్కంధపురి మూవీ టీం వాళ్లు ఏకంగా ఇది బాస్ సర్టిఫికేట్ ఇచ్చిన మూవీ అంటూ ప్రచారం చేసుకున్నారు. బాస్ సర్టిఫికేట్ ఇచ్చిన మూవీ ఇది అంటూ చేసిన ప్రచారం కిష్కంధపురికి బాగా కలిసొచ్చింది. దీని తర్వాతే ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ బాట పట్టారు. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కొట్టేసింది. పైగా కొన్ని ఏరియాల్లో నుంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మిరాయ్‌తో కిష్కింధపురి పోటీగా ఉంది. ఇప్పటికే గుంటూరు లాంటి కొన్ని ఏరియాల్లో మిరాయ్ కంటే కిష్కింధపురి మూవీకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు రోజుల్లో ఎవరికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయో చూడాలి.

Related News

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Parasakthi: సింగారాల సీతాకోకవే.. ఏముందిరా సాంగ్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Ustaad Bhagat Singh : సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ, మరి ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఏంటి?

Big Stories

×