BigTV English
Advertisement

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Bathukamma 2025: తెలంగాణ పుడమి ఒడిలో పురుడుపోసుకున్న పూలను పూజించే పండగే బతుకమ్మపండగ. ఈ పండగ ఆడబిడ్డల ఆత్మ గౌరవం, ఆత్మీయ సమ్మేళనానికి ప్రతీక. ప్రకృతితో మమేకమై జరుగుపుకునే బతుకమ్మ పండగను చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడుతూ పాడుతూ ఘనంగా జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామం ఈ సమయంలో కోలాహలంగా కనిపిస్తుంది. 21వ తేదీ నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ పండగ విశిష్టతను గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


బతుకమ్మ పండగను ఆశ్వయుజ మాస శుద్ధ అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కాలంలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. ముఖ్యంగా గునుగు , చామంతి, తంగేడు, ఎర్ర గన్నేరు, బంతి పూలను బతుకమ్మ తయారు చేయడంలో వాడతారు. బతుకమ్మ తయారు చేయడానికి గుమ్మడి ఆకులను పళ్లెంలో వేసి వాటిపై అందంగా పూలను పేరుస్తారు. చివరగా.. మధ్యలో పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. గౌరమ్మను దేవతగా భావిస్తారు.

బతుకమ్మ పండగ జరుపుకునే తేదీలు:
సెప్టెంబర్ 21- పాడ్యమి- ఎంగిలి పూల బతుకమ్మ
సెప్టెంబర్ 22- విదియ- అటుకుల బతుకమ్మ
సెప్టెబంర్ 23- తదియ- ముద్దపప్పు బతుకమ్మ
సెప్టెంబర్ 24- చవితి- నాన బియ్యం బతుకమ్మ
సెప్టెంబర్ 25-పంచమి- అట్ల బతుకమ్మ
సెప్టెంబర్ 26- షష్టి రోజు- అలిగిన బతుకమ్మ
సెప్టెంబర్ 27- సప్తమి రోజు- వేపకాయల బతుకమ్మ
సెప్టెంబర్ 28- అష్టమి రోజు- వెన్నముద్దల బతుకమ్మ
సెప్టెంబర్ 29,30- సద్దుల బతుకమ్మ


పూల జాతర, ప్రకృతి వేడుకగా జరుపుకునే అతి పెద్ద పండగే బతుకమ్మ. ఈ పండగకు సంబంధించి రకరకాల కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే బతుకమ్మ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది నైవేద్యాలు. తొమ్మిది రోజులు రకరకాల నైవేద్యాలు చేసి సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా.. చివరి రోజును సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు.

పితృపక్షం మహాలయ అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ పండగను జరుపుకుంటాము. ఈ రోజు చాలా మంది పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు. అందుకే దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు.

Related News

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Karthika Pournami 2025: 365 వత్తుల దీపం.. వెనక దాగి ఉన్న అంతరార్థం ఏంటి ?

Life of Radha: కృష్ణుడిని ప్రేమించిన రాధ చివరకు ఏమైంది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది?

Big Stories

×