BigTV English

Deepika Padukone: హమ్మయ్య ఎట్టకేలకు స్పందించిన దీపిక.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

Deepika Padukone: హమ్మయ్య ఎట్టకేలకు స్పందించిన దీపిక.. ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి?

Deepika Padukone:గత రెండు మూడు రోజులుగా ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనే (Deepika Padukone) టాక్ ఆఫ్ ద బాలీవుడ్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎప్పుడైతే వైజయంతి మూవీ మేకర్స్ ‘కల్కి 2’ సినిమా నుంచి దీపికాను తప్పిస్తున్నామని అధికారికంగా ప్రకటించారో అప్పటినుంచి ఈమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగెటివిటీ నెలకొంది . దీనికి తోడు గతంలో ‘స్పిరిట్’ మూవీ నుండి దీపికాను తప్పించడంపై సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) చేసిన పని కరెక్టే అంటూ ఇప్పుడు చాలామంది ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో అటు సందీప్ రెడ్డి వంగాను లాగుతూ ఇటు వైజయంతి మూవీ మేకర్స్ పెట్టిన పోస్ట్ ను కూడా హైలెట్ చేస్తూ దీపికాదే తప్పు అంటూ చాలామంది డైరెక్ట్ గానే పోస్ట్లు పెట్టడం ఇక్కడ సంచలనంగా మారింది.


కల్కి 2 వివాదంపై దీపిక..

ఇలా ఆమెపై సోషల్ మీడియాలో నెగెటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. దీపికా పదుకొనే స్పందించాలి అని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టును పంచుకుంటూ సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్ ఖాన్ (Shahrukh Khan) తో కలిసి ఆమె మరో సినిమా చేయడం గురించి ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ నేర్పిన పాఠం గురించి ప్రస్తావించింది. దీంతో కల్కి 2 గురించే మాట్లాడారని ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఎవరితో చేస్తున్నామనేదే ముఖ్యం..


అసలు విషయంలోకి వెళ్తే..”18 ఏళ్ల క్రితం ‘ఓం శాంతి ఓం’ సినిమా చేస్తున్నప్పుడు నాకు షారుక్ ఖాన్ కొన్ని పాఠాలు నేర్పారు. మనం సినిమాతో ఏం నేర్చుకున్నాం.. అందులో ఎవరితో చేస్తున్నామనే విషయాలు ముందుగా తెలుసుకోవాలని చెప్పారు. సినిమా విజయం కంటే ప్రాధాన్యమైనది ఎవరితో చేస్తున్నాం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. అప్పటినుంచే నేను ఆ మాటలను పూర్తిగా నమ్ముతున్నాను. అందుకే ఆ రోజు నుంచి నేను తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఆ పాఠాన్ని అమలు చేస్తున్నాను” అంటూ దీపిక తెలిపింది. మొత్తానికి అయితే దీపిక పెట్టిన ఈ పోస్ట్ ఇన్ డైరెక్ట్ గా కల్కి 2 నుంచి తీసేయడం పై అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

ఇక అసలేం జరిగిందని విషయానికి వస్తే.. కల్కి2898AD సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమా సీక్వెల్ లో కూడా దీపిక నటిస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దీపిక కల్కి 2 లో నటించడం లేదు అంటూ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ మేకర్స్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) కూడా దీనిపై పరోక్షంగా పోస్ట్ పెట్టారు. ” జరిగిన దానిని ఎవరూ మార్చలేరు.. కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు” అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. దీంతో దీపికా స్పందిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఇలా షారుక్ సినిమా గురించి చెబుతూ ఆయన నేర్పిన పాఠాల గురించి చెప్పి అందరిలో ఆసక్తి పెంచేసింది. ఏది ఏమైనా దీపిక ఇచ్చిన సడన్ ట్విస్ట్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: The Raja Saab Trailer : డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్… దెబ్బకు సారీ చెప్పిన డైరెక్టర్

Related News

Shraddha Kapoor: లేట్ వయసులో రిలేషన్షిప్… కన్ఫర్మ్ చేసిన శ్రద్ధా.. పోస్ట్ వైరల్

Tollywood: ప్రముఖ రచయిత కన్నుమూత.. ఏమైందంటే?

The Raja Saab Trailer : డార్లింగ్ ఫ్యాన్స్ ట్రోల్స్… దెబ్బకు సారీ చెప్పిన డైరెక్టర్

OG Movie Team: ఓజీ నిర్మాతలకు బజ్ బాధలు.. ఇక ఆపేయండి అంటూ ఆవేదన

Sharwanand: మరి పేషంట్ లా మారిపోతున్నారు ఏంటి సార్?

Kalki 2 : కల్కి సినిమా నుంచి తప్పుకోవడానికి అదే కారణం, దీపికా పదుకొనే రియాక్షన్

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

Big Stories

×