TGSRTC Bus Ticket: దసరా పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పెరిగాయనే వార్తలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ సర్వీసుల్లో ఎటువంటి టికెట్ ఛార్జీ పెంపు జరగలేదని, కేవలం స్పెషల్ బస్సుల్లోనే కొంత సవరణ అమలవుతోందని తెలిపింది.
ప్రతి ఏడాది పెద్ద పండుగల సమయంలో, ముఖ్యంగా సంక్రాంతి, దసరా, బతుకమ్మ, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది వంటి సందర్భాల్లో, ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ నుంచి తమ సొంత ఊర్లకు బయలుదేరుతుంటారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా ఇబ్బందులు రాకుండా చేయడానికి ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడుపుతుంది. అయితే, ఈ బస్సులు తిరుగు ప్రయాణంలో చాలా సార్లు ఖాళీగా వస్తాయి. దీంతో కనీస డీజిల్ ఖర్చు భరించడానికి 2003లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం ప్రత్యేక సర్వీసుల్లో మాత్రమే సాధారణ టికెట్ ధరపై గరిష్టంగా 50 శాతం వరకు సవరణకు అనుమతి ఉంది.
ప్రతి రోజూ నడిచే సాధారణ బస్సుల్లో టికెట్ ధరలు ఎప్పటిలాగే ఉంటాయి. పండుగల సమయంలో మాత్రమే నడిచే ప్రత్యేక బస్సుల్లోనే ఈ సవరణ ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 10 వేల వరకు బస్సులు ఉన్నప్పటికీ, పండుగల సమయంలో రద్దీకి అనుగుణంగా రోజుకు 500 నుంచి 1000 వరకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడుపుతారు. అందువల్ల మొత్తం సర్వీసుల్లో చిన్న శాతం మాత్రమే ఈ సవరణకు గురవుతుంది.
Also Read: AP Onion Farmers: ఉల్లి రైతులకు బాబు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ. 50 వేలు
ఈ ఏడాది కూడా బతుకమ్మ, దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ 20న, అలాగే 27 నుంచి 30 వరకు, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేసి స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఆ రోజుల్లో మాత్రమే టికెట్ ధరలలో కొంత సవరణ ఉంటుంది. అయితే అదే రోజుల్లో నడిచే రెగ్యులర్ బస్సుల ధరల్లో ఎటువంటి మార్పు ఉండదు.
అన్ని బస్సుల్లోనే ఛార్జీలను పెంచారు అనే ప్రచారం పూర్తిగా తప్పు. ఉద్దేశపూర్వకంగా కొందరు ఈ రకమైన వదంతులు వ్యాప్తి చేస్తున్నారని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. 2003 నుంచి కొనసాగుతున్న విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నామని, కొత్తగా ఎలాంటి ఛార్జీ పెంపు చేయలేదని యాజమాన్యం స్పష్టంచేసింది.
టీఎస్ఆర్టీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దసరా పండుగ సమయంలో స్పెషల్ బస్సులు నడుస్తున్నందున ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది. రద్దీ కారణంగా చివరి నిమిషంలో టిక్కెట్లు దొరకకపోవచ్చని, కాబట్టి ముందస్తుగా ప్రణాళికలు వేసుకుంటే సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది.
అలాగే బస్సులు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వస్తుండటమే ఈ సవరణకు కారణమని, ప్రజలపై భారం మోపే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ విధానం ద్వారా సంస్థ నష్టాలు కొంతవరకు తగ్గుతాయి, అదే సమయంలో ప్రయాణికులకు కూడా రవాణా సౌకర్యం అందుతుంది. కాబట్టి “టికెట్ ధరలు పెంచారు” అనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని మరోసారి విజ్ఞప్తి చేసింది. ప్రజలు నిర్భయంగా సాధారణ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
*టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు*
*దసరా స్పెషల్ సర్వీసుల్లోనే జీవో ప్రకారం చార్జీల సవరణ : టీజీఎస్ఆర్టీసీ*
పండగుల నేపథ్యంలో బస్సు టికెట్ చార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. టికెట్ చార్జీలు పెరిగాయ… pic.twitter.com/cWAjTwepq9
— TGSRTC (@TGSRTCHQ) September 19, 2025