Honey Trap: విశాఖలో ఓ ఇన్‌స్టా ఇన్‌ప్లుయెనర్స్ హనీట్రాప్‌కు పాల్పడింది. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుంది ఇన్‌స్టా ఇన్‌ప్లుయెనర్స్ సౌమ్యరెడ్డి. తనను ప్రేమించానంటూ వలపు వల విసిరింది. తనకు వివాహం అయ్యిందని చెప్పినా.. రెండో భార్యగా ఉంటానని ముగ్గులోకి దింపింది. తర్వాత అనారోగ్యం, ఇతర అవసరాల పేరిట అతని దగ్గర దాదాపు కోటి రూపాయిలు తీసుకుంది. అనంతరం నెంబర్ బ్లాక్ చేసి.. ఇక తనకు కాల్ చేయవద్దని లాయర్‌తో ఫోన్ చేయించి బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో యువకుడి నుండి కూడా లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.