Deepika Padukone: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది దీపిక పదుకొనే (Deepika Padukone). అంతేకాదు అత్యంత ప్రజాధారణ పొందిన ప్రపంచ ఐకాన్ స్టార్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. గత రెండు దశాబ్దాలకు పైగా తన కెరియర్లో అనేక బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మాతృత్వపు క్షణాల ఆస్వాదిస్తూ.. తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నా.. కొన్ని కొన్ని సార్లు ఈమె చేసే పనులు ఈమెకు అరుదైన గౌరవాన్ని అందిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో ఈమె పంచుకున్న ఒక రీల్ ఈమెకు అరుదైన గుర్తింపును అందించింది.
ఇంస్టాగ్రామ్ లో అరుదైన రికార్డ్ సాధించిన దీపికా పదుకొనే..
తాజాగా దీపికా పదుకొనే ఒక హోటల్ చైన్ (#HiltonForTheStay) తో కలసి పెయిడ్ పార్టనర్ షిప్ లో భాగంగా తన ఫోటోషూట్ కి సంబంధించిన వీడియోని ఇంస్టా లో షేర్ చేసింది. దీనికి ఏకంగా 1.9 బిలియన్ల వ్యూస్ వచ్చాయి.. అంటే 190 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన రీల్ గా రికార్డ్ సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు హార్దిక్ పాండ్య(1.6 బిలియన్లు) పై ఉంది. అయితే దీనిని ఇప్పుడు దీపిక బ్రేక్ చేసింది అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో ఈమెకు దాదాపు 80 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సాధించిన రీల్గా దీపిక పదుకొనే రీల్ స్థానం సంపాదించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఈ రీల్ పోస్ట్ చేసిన 8 వారాలలోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.
దీపికా పదుకొనే సినిమాలు..
ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. చివరిగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో.. అమితాబ్ బచ్చన్ , రాజేంద్రప్రసాద్, కమలహాసన్ వంటి భారీతారాగణం నటించిన ‘కల్కి 2898ఏడి’ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే ఆమె గర్భవతి కావడం గమనార్హం . ఈ సినిమా పూర్తయిన తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది దీపికా పదుకొనే. ఈ సినిమా తర్వాత ‘ సింగం ఎగైన్ ‘ అనే సినిమాలో కూడా నటించింది.. ఇప్పుడు షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్ సుహానా ఖాన్ లతో కలిసి ‘కింగ్’ సినిమా కోసం ఎంపికైన ఈమె.. మరొకవైపు అట్లీ, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ప్రాజెక్ట్ ‘A22xA6’ లో కూడా భాగమయ్యింది.అలాగే బ్రహ్మాస్త్ర పార్ట్ 2, కల్కి 2898AD సీక్వెల్ లో కూడా నటిస్తోంది దీపిక.
?utm_source=ig_web_copy_link
ALSO READ: NFA -2025: నేషనల్ అవార్డ్స్ గ్రహీతలకు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?