BigTV English

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?


Raksha Bandhan: శ్రావణ మాసం అంటే పండుగల మాసం.. ఈ మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి రాఖీ పండుగ.. ఈ పండుగ అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముడు.. మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ పండుగ కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా ఈ రాఖీ పండుగ చాలా చాలా ప్రధానమైనది. సోదరులు అందుబాటులో లేకపోయిన కొరియర్టలో అయిన రాఖీలు దేశ విదేశాలకు పంపింస్తుంటారు.

సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలను.. తాము ఉన్నామని రక్షా బంధన్ ద్వారా భరోసా ఇచ్చే ఈ పండుగను భారత్‌లోని కొన్ని గ్రామాల్లో జరుపుకోరు అంటే ఆశ్చర్యం కలుగుతుంది. పండుగలు జరుపుకోకపోవటానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు ఆ గ్రామాల ప్రజలు.. ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ఓ గ్రామంలో కర్రలకు రాఖీ కట్టే ఆచారం ఉంటే.. మరో గ్రామంలో అస్సలు పండుగను జరుపుకోనే జరుపుకోరు.


కర్రలకు రాఖీ కట్టే వింత ఆచారం..

ఉత్తరప్రదేశ్‌లోని హార్పూర్ జిల్లాలో దాదాపు 60 గ్రామాల్లో ప్రజలు రక్షా బంధన్ జరుపుకోరట. అయితే జరుపుకోరు అంటే పూర్తిగా జరుపుకోరని కాదు దాని అర్థం. సాధారణంగా మన సాంప్రదాయం ప్రకారం సోదరుల చేతులకు వారి అక్కచెల్లెళ్లు ‘రాఖీ’ కడతారు. కానీ ఈ ప్రాంతంలో మాత్రం ఆడవాళ్లు మాత్రం ‘కర్ర’లకు రాఖీలు కడతారట. అయితే ఈ సాంప్రదాయం నాలుగైదు వందల ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీంతో ఈ 60 గ్రామాల్లో మగవారి చేతులకు రాఖీలు కనిపించవు.. కానీ ఎక్కడ చూసిన కర్రలకు మాత్రం రాఖీలు కనిపిస్తాయి.

ఈ 60 గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సంప్రదాయాల్ని ఈనాటికి పాటిస్తున్నారు. యూపీలోని హాపూర్ జిల్లాలోని 60 గ్రామాల సముదాయం ‘సధా చౌరాసి. క్రీస్తు శకం 1576లో హల్దీఘాటీ యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధంలో పాల్గొనేందుకు వెళ్లే సైనికులకు వారి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు భార్య, లేదా సోదరి, లేదా తల్లి ఎవరోకరు ‘రక్షా బంధన్’ కట్టి వీర తిలకం దిద్ది పంపించేవాళ్లు.. ఇది భారతదేశంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో ఇటువంటివి చాలా చూశాము. కానీ హల్దీఘాటీ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు మహిళలు ఎవరు రక్షా బంధన్ కట్టలేదు. సైనికుల కర్రలకు రక్షా బంధన్ కట్టారు. అప్పట్లో చేతులకు రాఖీలు కట్టే సంప్రదాయం అక్కడ లేదట. అందుకే ఇప్పటికే అక్కడి మహిళలు మగవారి చేతులకు రాఖీలు కట్టరు. గతంలో లాగానే కర్రలకు రాఖీలు కడతారు. వందల ఏళ్లుగా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. రాఖీ పూర్ణిమ రోజున కర్రలకే రాఖీలు కడతారు. దీన్ని స్థానికంగా ఛాడీ పూజ అని పిలుస్తారు. అంతేకాకుండా ఆ రోజున అక్కడి సమీపంలోని గ్రామాల్లో జాతరలు జరుపుకుంటారు.

రాఖీ పండుగ శాపం

ఉత్తరప్రదేశ్.. మీరట్‌లో సురానా అనే గ్రామంలో కూడా రక్షా బంధన్ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఆ గ్రామంలో అందరిని చంపేశాడట. కేవలం ఒకే ఒక్క మహిళ ఆమె ఇద్దరు మగ పిల్లలు బతికి బయటపడ్డారట. ఎందుకంటే ఆరోజు వారు ముగ్గురు ఆ ఊర్లో లేకపోవటంతో బతికి ఉన్నారు. వారు ఎలాగో జీవించారు. మహ్మద్ ఘోరీ దండయాత్ర నుంచి తప్పించుకున్న మహిళ చబ్బయ్య గోత్రానికి చెందిన మహిళ. ఆమె ఇద్దరు కుమారులు లఖన్, చూండా. ఊరు ఊరంతా చనిపోగా భయపడినవారు కొంతకాలం చుట్టు పక్కల గ్రామాలు తిరుగుతు కాలం వెళ్లదీశారు. అలా కొంతకాలానికి తమ ఊరు చేరుకున్నారు.

ఆ తరువాత కొంతకాలానికి రాఖీ పండుగ జరుపుకుందామనుకున్నారు. రాఖీ పండుగ రానే వచ్చింది. పండుగకు అన్నీ సిద్ధం చేసుకోగా ఆ ఇద్దరిలో ఒకపిల్లాడు దివ్యాంగుడిగా మారిపోయాడట. దాంతో ప్రజలు భయపడ్డారు. మహ్మద్ ఘోరీ శాపం వెంటాడుతోందని భావించారు. ఆ నమ్మకం బలపడింది. దీంతో ఇంకా రాఖీ పండుగ చేసుకునేది లేదని నిర్ణయించుకున్నారు. అలా రాఖీ పండుగకు శాశ్వతంగా స్వస్తి పలికారు. అప్పటి నుంచి అక్కడ రాఖీ పండుగ జరుపుకోవటంలేదని స్థానికులు చెబుతున్నారు. అసలు ఆ ధైర్యం కూడా ఎవ్వరు చేయటంలేదట.

జమిందారుల్ని బికారుల్ని చేసిన రాఖీ..

ఉత్తరప్రదేశ్‌లోనే సంభాల్ జిల్లాలో బైనిపూర్ చాక్ గ్రామానిది మరో వింత కథ. రాఖీ పండుగ జరుపుకోని మరో గ్రామం. రక్షా బంధన్ రోజు రాఖీ కట్టాక.. సోదరులు డబ్బులు లేదా మరో బహుమతి ఇస్తుంటారనే విషయం తెలిసిందే. అలా బైనిపూర్ చాక్ గ్రామంలో వారి సోదరులకు రాఖీ కట్టాక సోదరీమణులు.. ఆస్తిని ఇమ్మని కోరితే.. సోదరులు ఆ ఆస్తిని వదిలి సోదరులు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా ఆస్తి అంతా ఇస్తే వారు బికారులుగా అయిపోతారు కాబట్టి అసలు రాఖీ పండుగే జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఆ భయంతోనే 300 ఏళ్లుగా ఈ రాఖీకి రాం రాం పలికారు. ఇది కేవలం భయంతో పండుగ మానేయటం కాదు దానికి నిజంగానే ఓ ఘగటన జరిగిందట..

Also Read: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

ఆ గ్రామంలో ఓ జమిందార్ ఉండేవాడట. అతనికి కొడుకులు తప్ప కూతుళ్లు లేరు. కూతురు కావాలని జమిందారు, అతని కొడుకులు పెద్ద మనస్సుతో కులం కూడా పట్టించుకోకుండా ఆ ప్రాంతంలోని పేద అమ్మాయిలను తీసుకొచ్చి వారితో రాఖీలు కట్టించుకున్నారు. ఆ పేద అమ్మాయిలు బహుమతిగా జమిందారు ఆస్తికే ఎసరు పెట్టారు. జమిందార్ ఆస్తి మొత్తం ఇవ్వాలని కోరారు. కోరింది ఇవ్వకపోతే మీ వంశానికే మచ్చ అంటూ ఎమోషనల్‌గా కూడా చెప్పేసరికి పాపం జమిందారు కొడుకులు వాళ్లు అడిగింది ఇస్తామని వాగ్ధానం చేశారు. అలా కొడుకుల చేతులకు రాఖీలను చూసిన జమిందార్ పేద అమ్మాయిలు కదా వారికి బహుమతిగా ఏమిచ్చారు? అని కొడుకుల్ని అడిగాడు. దానికి వారు ఆస్తిని అడిగారని చెప్పుకొచ్చారు. దీంతో జమిందారు కొడుకుల్ని మందలించాడు. కానీ కోరి తామే తీసుకొచ్చి కట్టించుకున్నాం.. పైగా మాట కూడా ఇచ్చాం ఇంకా రాఖీ పండుగకు విలువ ఇస్తూ.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని మొత్తం ఆస్తి ఆ పేద అమ్మాయిలకు ఇచ్చి జమిందారు కుటుంబం అంతా ఊరు విడిచి వెళ్లిపోయిందట. అందువల్ల అప్పటి నుంచి స్థానికులు ఈ పండుగ జరుపుకోవట్లేదు.

ప్రాణాలు తీసిన రాఖీ పండుగ..

ఇది కూడా ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోనే గున్నార్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో రాఖీ జరుపుకోరు. దీనికి కూడా ఓ బలమైన కారణం ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఆమె సోదరుడు చనిపోయాడు. అంతే రాఖీ పండుగ వల్లే ఈ ఘోరం జరిగిందని నమ్మి ఈనాటికీ రాఖీ చేసుకోవటం లేదు. తరువాత తరువాత ఇదంతా మూఢనమ్మకం అంటూ కొంతమంది మళ్లీ రాఖీ పండుగ చేసుకోవటం ప్రారంభించారు. కొంతమంది ఆడవాళ్లు తమ సోదరులకు రాఖీ కట్టారు. కానీ రక్షా బంధన్ రోజునే.. ప్రమాదం జరిగి వారిలో చాలామంది మగవారు ప్రాణాలు కోల్పోయారు. అలా రాఖీ పండుగే పెద్ద శాపంగా మారింది ఆ ప్రాంతంలోని గ్రామాలకు. అంతే ఇక అప్పటి నుంచి రాఖీ పండుగ పేరు చెబితే హడలిపోతారు. గోండా జిల్లాలోని బికంపూర్ జగత్ పూర్వా అనే గ్రామంతో పాటు ఉత్తరప్రదేశ్ లోని చాలా గ్రామాల్లో రాఖీ పండుగ జరుపుకోరు.

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×