NFA -2025..రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం 71వ చలన చిత్ర అవార్డుల(71 National Film Awards) జాబితాను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ చలనచిత్ర అవార్డులలో తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి కూడా కొన్ని విభాగాలలో అవార్డులు వచ్చాయి. అలా భగవంత్ కేసరి (Bhagavanth Kesari), హనుమాన్(Hanuman), బలగం (Balagam) వంటి సినిమాలకు ఈ అవార్డులు వరించాయి. అయితే నేషనల్ అవార్డ్స్ అని వింటూనే ఉంటాం కానీ ఆ అవార్డ్స్ కి నగదు బహుమతిగా ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం చాలామందికి తెలియదు. మరి నేషనల్ అవార్డు విన్నర్స్ కి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
నేషనల్ అవార్డ్స్ ప్రైజ్ మనీ ఎంతంటే?
నేషనల్ అవార్డ్స్ లో స్వర్ణకమలం, రజత కమలం అనే రెండు అవార్డ్స్ ఉంటాయి. అయితే ఇందులో స్వర్ణ కమలం ఎవరెవరికి ఇస్తారంటే.. ఉత్తమ పిల్లల సినిమా, ఉత్తమ దర్శకుడు,ఉత్తమ ప్రజాధరణ పొందిన సినిమా, ఉత్తమ తొలి సినిమా వారికి అందిస్తారు. ఇక రజత కమలం ఉత్తమ హీరో, ఉత్తమ సహాయ నటులు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయిని, ఉత్తమ ఫైట్ కొరియోగ్రాఫర్ వంటి వాళ్లకు అందజేస్తారు. అయితే స్వర్ణకమలం (Golden Lotus) అందుకునే వారికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారంటే.. అక్షరాల రూ.3 లక్షలు.. అలాగే రజత కమలం అందుకునే వారికి రూ.2లక్షలు..
స్వర్ణకమలం అందుకోబోయేది వీరే..
ఇదిలా ఉండగా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా విక్రమ్ మాస్సే నటించిన ట్వెల్త్ ఫెయిల్(12th Fail) అవార్డు అందుకోగా.. ఈ మూవీ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా(vidhu Vinod Chopra) స్వర్ణ కమలంతో పాటు రూ.3 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటారు. ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో ది కేరళ స్టోరీ(The Kerala Story) మూవీకి డైరెక్షన్ చేసిన సుదీప్తో సేన్ కి స్వర్ణకమలం తోపాటు రూ.3 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. అలాగే ఉత్తమ ప్రజాధరణ పొందిన సినిమాగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహాని(Rocky Aur Rani ki Prem Kahaani) సినిమా నిర్మించిన కరణ్ జోహార్(Karan Johar) కి, అలాగే ఉత్తమ మొదటి సినిమా విభాగంలో
ఆత్మపాంప్లెట్ అనే మూవీ డైరెక్టర్ ఆశిష్ బెండే (Ashish Bendey)కి స్వర్ణకమలం తోపాటు రూ.3 లక్షల నగదు అందజేస్తారు. అలాగే భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ నిర్మాత స్వర్ణ కమలంతో పాటు 3 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటారు.
రజత కమలం అందుకునే వారు వీరే..
ఇక రజత కమలం (Silver lotus) అందుకున్న వారిలో ఉత్తమ హీరోలుగా షారుక్ ఖాన్(Shahrukh Khan), విక్రాంత్ మాస్సె (Vikranth Masse) రజత కమలం తో పాటు 2 లక్షలు ఇద్దరికీ సమానంగా పంచుతారు. అలాగే ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ (Rani Mukherjee) అవార్డుతో పాటు 2లక్షల ప్రైజ్ మనీ అందిస్తారు. ఇక ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ముత్తుపెట్టై సోమ భాస్కర్, విజయ రాఘవన్ ల ఇద్దరికీ అవార్డు వచ్చింది. వీరికి రజత కమలంతో పాటు 2 లక్షల నగదుని సమానంగా ఇస్తారు.
ఇక మన టాలీవుడ్ నుండి హనుమాన్(Hanu Man) మూవీకి యానిమేషన్ కంపెనీ, స్టంట్ కొరియోగ్రాఫర్లు రజత కమలంతో పాటు 2 లక్షల ప్రైజ్ మనీ అందుకుంటారు.
ఏడాది తరువాతే..
అయితే ఈ విజేతలను ప్రకటించిన ఏడాదికి అవార్డులను, ప్రైజ్ మనీని అందజేస్తారు.
Also read : Jabardasth Dorababu: ఏంటీ.. మెగా బ్రదర్స్ ఇలాంటివారా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన దొరబాబు!