Bigg Boss 9:ఎప్పుడైతే హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ సీజన్ చాలా కొత్తగా.. భిన్నంగా ఉంటుంది అని ప్రకటించారో.. ఇక అప్పటినుంచి ఈ సీజన్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. చెప్పినట్టుగానే డబుల్ హౌస్ .. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ షోలో దాదాపు 9 మంది సెలబ్రిటీలు.. 6 మంది కామనర్స్ అడుగుపెట్టారు. అటు కామనర్స్ విషయానికి వస్తే.. హౌస్ లోకి వచ్చే ముందు అగ్నిపరీక్షలో తమను తాము ప్రూవ్ చేసుకొని అందరిని మెప్పించారు. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత వీరి ఒక్కొక్కరి ముఖాలు బయటపడటంతో నెమ్మదిగా మాస్కులు తొలగిపోతున్నాయి అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అగ్నిపరీక్షలో సత్తా చాటిన హరీష్ , మనీష్ ఇక్కడ మాత్రం తమ మాస్కులను తొలగిస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా.. ఊహించని విధంగా మొదటి వారం ఎలిమినేషన్ జరగబోతున్న విషయం తెలిసిందే..అయితే ఈసారి ఒకరు కాదు ఏకంగా ఇద్దరు హౌస్ నుంచి వెళ్లబోతున్నారు అని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే.. మొదటి వారానికి సంబంధించి.. నామినేషన్ లో భాగంగా బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ జాబితాను విడుదల చేసింది. ఈ ఓటింగ్ ను బట్టి చూస్తే ఏకంగా ఇద్దరు ఈసారి హౌస్ నుంచి వెళ్లబోతున్నారని స్పష్టం అవుతుంది.
also read:Mirai Heroine : రితికా నాయక్ రిస్కీ స్టెప్… అసలు మూవీలో ఆమె యాక్టింగే లేదు!
ఎలిమినేషన్ కి దగ్గరగా టాప్ కంటెస్టెంట్స్..
తొలివారం నామినేషన్ ప్రక్రియ చాలా భీకరంగా.. తీవ్రవాగ్వాదాల మధ్య ముగిసింది. బిగ్ బాస్ ఇంటిలో తొలి వారం నామినేట్ అయిన వారిలో తనూజ గౌడ, ఇమ్మానుయేల్, ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, డెమోన్ పవన్ , సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నారు. అయితే వీరంతా కూడా నామినేషన్ ప్రక్రియను ముగించుకున్నారు. అయితే ఈ వారం నామినేట్ అయినవారికి.. ఓటింగ్ జరగగా.. అందులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.
అనూహ్య మార్పుల మధ్య ఎలిమినేషన్..
ఇదిలా ఉండగా మరొకవైపు.. ఈ వారం అందరి అంచనాలకి మించి కెప్టెన్సీ ఎంపిక జరిగింది. దమ్ము శ్రీజ చాలా బాగా ఆడి సంజనకు కెప్టెన్సీ పదవిని సాధించి పెట్టింది. దాంతో బిగ్ బాస్ తెలుగు 9షో లో తొలి కెప్టెన్ గా సంజన ఎంపికయింది. తాత్కాలికంగా ఈమె ఇంటికి ఓనర్ గా మారింది. కెప్టెన్సీ పదవి దక్కడంతో తన ఆటలో మార్కు చూపించడం మొదలుపెట్టింది. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్న సమయంలో అనూహ్యంగా ఎలిమినేషన్ కి తెర లేపారు.
ఆ ఇద్దరిపై ఎలిమినేషన్ వేటు..
ఈసారి ఓటింగ్ లిస్ట్ చూస్తే.. టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ గా భావించిన ఇద్దరు టాప్ సెలబ్రిటీలు ఓటింగ్ చివరి స్థానంలో నిలవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రష్టి వర్మ ఈ వారం ఎలిమినేట్ అయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు. దీంతో ఈమె ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈవారం ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉన్న మరో సెలబ్రిటీ ఫ్లోరా.. సీనియర్ హీరోయిన్గా అడుగుపెట్టి.. టాప్ కంటెస్టెంట్ గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పెద్దగా తన ఆట తీరును ఇక్కడ ప్రదర్శించలేదు. ఈసారి ఆటం చదరంగం కాదు.. రణరంగం అంటూ సంకేతాలు ఇచ్చిన నాగార్జున.. డబుల్ ఎలిమినేషన్ తో భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా అనే అనుమానం కూడా కలుగుతుంది. దీనికి తోడు ప్రముఖ బిగ్ బాస్ రివ్యూయర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి కూడా తన అభిప్రాయంగా ఫ్లోరా షైనీ, శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నట్లు చెప్పుకొచ్చారు. మరి ఓటింగ్ ను బట్టి చూస్తే ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. కాబట్టి చివరిగా ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.