Nano Banana Figurines to Videos| గూగుల్ జెమిని ఏఐ ఇటీవల లాంచ్ చేసి నానో బనానా ఏఐ టూల్ కొద్ది రోజుల్లోనే సంచలనం సృష్టించింది. ఈ టూల్ సాధారణ ప్రాంప్ట్‌లతో జీవం ఉట్టిపడే 3D మోడల్స్, క్రియేటివిటీ ఎడిట్‌లను రూపొందిస్తోంది. అయితే ఈ 3D మోడల్స్‌ను ఆకర్షణీయమైన వీడియోలుగా కూడా మార్చవచ్చు.
OpenAI సోరా, గూగుల్ వీయో 3 వంటి వీడియో టూల్స్ పేమెంట్ సర్వీసులైనప్పటికీ.. గ్రోక్ AI, క్లింగ్ AI వంటి ఉచిత టూల్స్‌తో భారతీయ యూజర్లు తమ నానో బనానా మోడల్స్‌ను సులభంగా వీడియోలుగా మార్చవచ్చు. ఈ గైడ్‌లో దాని గురించి సులభమైన దశలు తెలుసుకుందాం.
జెమిని నానో బనానా అంటే ఏమిటి?
గూగుల్ జెమిని నానో బనానా ఒక అద్భుతమైన AI టూల్, ఇది సాధారణ ఫొటోలను సూపర్ క్వాలిటీ గల 3D ఫిగర్స్, హోలోగ్రాఫ్‌లు లేదా ఫ్యాషన్ ట్రై-ఆన్ విజువల్స్‌గా మారుస్తుంది. సహజమైన భాషా ప్రాంప్ట్‌లను ఉపయోగించి, ఇది స్థిరత్వం, రియలిస్టిక్ గా రూపొందిస్తుంది. కలెక్టబుల్స్, క్రియేటివ్ ప్రాజెక్టులు, వ్యక్తిగత ఫిగర్స్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్.
3D మోడల్స్‌ను వీడియోలుగా ఎందుకు మార్చాలి?
స్థిర 3D ఇమేజ్‌లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వీడియోలు జీవం ఉన్నట్టుగా యానిమేషన్, సినిమాటిక్ కెమెరా కదలికలు, సౌండ్ ఎఫెక్ట్స్‌ను జోడిస్తాయి. కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, హాబీస్ట్‌లకు తమ నానో బనానా క్రియేటివిటీని డైనమిక్‌గా ప్రదర్శించడానికి ఇది గొప్ప మార్గం.
3D మోడల్స్‌ను ఫ్రీ వీడియోలుగా మార్చేందుకు ఈ స్టెప్స్ పాటించండి
మీ స్మార్ట్‌ఫోన్‌లో గ్రోక్ యాప్‌ను ఓపెన్ చేయండి లేదా X (పాత ట్విట్టర్) ద్వారా యాక్సెస్ చేయండి.
ఇమేజిన్ విభాగానికి వెళ్లి, గ్యాలరీ ఐకాన్‌పై ట్యాప్ చేయండి.
మీ నానో బనానా 3D మోడల్‌ను అప్‌లోడ్ చేయండి.
‘మేక్ వీడియో’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
కొన్ని సెకన్లలో, సౌండ్ ఎఫెక్ట్స్‌తో కూడిన చిన్న యానిమేటెడ్ వీడియో లభిస్తుంది.
సంతృప్తి కలిగితే సేవ్ చేయండి లేదా మళ్లీ రీజనరేట్ చేయండి.
క్లింగ్ AI ఉపయోగించి
ఉదాహరణ: “ఫిగరిన్‌ను స్థిరంగా ఉంచి, కనురెప్పలు ఆడడం, శ్వాస తీసుకోవడం వంటి సూక్ష్మ కదలికలు జోడించండి. సినిమాటిక్ పాన్‌లు, జూమ్‌లు, డెప్త్-ఆఫ్-ఫీల్డ్ షిఫ్ట్‌లతో కెమెరాను యానిమేట్ చేయండి.”
క్లింగ్ AI మీ ఫిగరిన్‌కు సినిమాటిక్ వీడియోను రూపొందిస్తుంది.
వీడియోను డౌన్‌లోడ్ చేయండి లేదా అవసరమైతే మళ్లీ రీజనరేట్ చేయండి.
బోనస్: మీ స్వంత ఫిగరిన్‌ను సృష్టించండి
మీరు మీ స్వంత కలెక్టబుల్ ఫిగరిన్‌ను రూపొందించాలనుకుంటున్నారా?
ఈ ఉచిత టూల్స్‌తో, మీ నానో బనానా 3D మోడల్స్‌ను సులభంగా ఆకర్షణీయ వీడియోలుగా మార్చవచ్చు. కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా లేదా వ్యక్తిగత ప్రాజెక్టుల కోసం ఈ దశలను అనుసరించండి!
Also Read: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్‌లు.. వీటి ధర కోట్లలోనే