Anti Aging: అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని అందరికీ ఉంటుంది. చాలా మంది ముఖం కాంతివంతగా కనిపించడానికి, వయస్సు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలని రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇదిలా ఉంటే మరికొందరు మాత్రం వయస్సు పెరిగే కొద్దీ ఎలాంటి టిప్స్ పాటించకుండానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎంతో మంది హీరో, హీరోయిన్లు వయస్సు పెరుగుతున్నా కూడా యవ్వనంగా కనిపించడం మనం నిజజీవితంలో కూడా చూస్తూనే ఉంటాం.
ఉదాహరణకు హీరో నాగార్జున మన్మథుడు సినిమాలో నటించినప్పుడు 43 ఏళ్ల వయస్సు ఉన్నారు. ఆ తర్వాత కూడా ఆయన అందం పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం 66 ఏళ్లు ఉన్నారు కింగ్ నాగార్జున.. అయినప్పటికీ యవ్వంగా , ఫిట్‌గా కనిపిస్తారు. ఇది కేవలం బాహ్య సౌందర్యం కాదు, అంతర్గత పరిణతి, ఆత్మవిశ్వాసం, జీవిత అనుభవం వారిపై చూపే ప్రభావం. మరి 35 ఏళ్ల తర్వాత కూడా కొందరు తమ అందాన్ని, ఆకర్షణను ఎలా కొనసాగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆత్మవిశ్వాసం అనేది ఒక కొత్త అందం:
యుక్త వయసులో చాలామంది రూపం గురించి ఆందోళన చెందుతారు. కానీ.. 35 ఏళ్ల తర్వాత జీవితంలో ఎంతో అనుభవం సాధించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం వారి నడవడిక, మాట్లాడే తీరు, చిరునవ్వులో స్పష్టంగా కనిపిస్తుంది. తమను తాము ప్రేమించడం, నమ్మకంగా ఉండడం వల్ల వచ్చే ఈ కాంతి వారిని మరింత అందంగా చూపిస్తుంది. సైకాలజీ ప్రకారం… ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు ఇతరులకు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారట.
2. పరిణతి:
వయస్సు పెరిగే కొద్దీ జీవితంలో ఎన్నో అనుభవాలు, పాఠాలు నేర్చుకుంటారు. ఈ పరిణతి వారిలో ప్రశాంతతను తీసుకొస్తాయి. ఇది వారి చూపులో.. నవ్వులో, మాటల్లో ప్రతిబింబిస్తుంది. ఈ లక్షణాలు వారిని కేవలం అందంగానే కాకుండా.. గౌరవనీయంగా చూపిస్తాయి. నిజమైన అందం అనేది కేవలం బయటికి కనిపించే రూపంలో కాకుండా.. ఒక వ్యక్తి వివేకం, అంతర్గత ప్రశాంతతలో ఉందని నిపుణులు చెబుతారు.
3. ఆరోగ్యకరమైన జీవనశైలి, సంరక్షణ:
యువతలో జీవనశైలి అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ వయస్సు పెరిగే కొద్దీ చాలామంది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెడతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర పోవడం వంటి అలవాట్లు వారి ఆరోగ్యాన్ని, శరీర సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల వారి చర్మం కాంతివంతంగా, జుట్టు దృఢంగా ఉంటుంది. దీనివల్ల వారు వయసులో ఉన్న దానికంటే యవ్వనంగా కనిపిస్తారు.
Also Read: కొబ్బరి నూనెలో ఇవి కలిపి వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?
4. ప్రవర్తనా విధానం:
వయస్సు పెరిగే కొద్దీ ప్రవర్తన మరింత మెరుగుపడుతుంది. తమ శరీరానికి, వయసుకు తగిన దుస్తులు, హెయిర్ స్టైల్, మేకప్ వంటివి వాడటం వల్ల మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. యువత ట్రెండ్ ఫాలో అయితే.. 35 ఏళ్లపైబడిన వారు వారికి తగిన లైఫ్ స్టైల్ పాటిస్తారు. ఈ పరిణతి చెందిన శైలి వారిని మరింత స్టైలిష్‌గా, అందంగా కనిపించేలా చేస్తుంది.
5. జన్యువులు:
కొందరు జన్యుపరంగా వయస్సు పెరిగినా కూడా శరీరంలో తక్కువగా మార్పులు వచ్చే అదృష్టం ఉంటుంది. జన్యువులు చర్మం యొక్క స్థితిస్థాపకతను, జుట్టు బలాన్ని, వయస్సు ప్రభావాలను నిర్ణయిస్తాయి. అయితే.. కేవలం జన్యువులు మాత్రమే అందాన్ని నిర్ధారించలేవు. ఆరోగ్యకరమైన జీవనశైలితో కూడిన జన్యువులు ఒక వ్యక్తి వయస్సు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించడానికి ఉపయోగపడతాయి.