Sree Leela: ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీ లీలా (Sree Leela) పై తాజాగా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అంటూ ఏపీ స్టూడెంట్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అమర్ యాదవ్ (Amar Yadav)డిమాండ్ చేయడం సంచలనగా మారింది. అనంతపురంలో జరిగిన స్టూడెంట్ జేఏసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన శ్రీ లీలాపై కేసు ఫైల్ చేయాలంటూ చేసిన కామెంట్లు సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. అసలు విషయంలోకి వెళ్తే శ్రీ చైతన్య విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ హీరోయిన్ శ్రీ లీల వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కారణంగానే ఈమెపై క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శ్రీ లీలాపై క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలి – జేఏసీ అధ్యక్షుడు అమర్ యాదవ్
సమావేశంలో అమర్ యాదవ్ మాట్లాడుతూ..” తమ స్కూల్, కాలేజీల్లో చేరితే మంచి ర్యాంకులు వచ్చేలా చేస్తామంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని” ఆయన మండిపడ్డారు.” ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న శ్రీ లీలాపై కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి ” అని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రీ లీల కెరియర్:
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె తొలిసారి ‘పెళ్లి సందD’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ ((Raviteja) హీరోగా నటించిన ‘ధమాకా’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకొని, ఓవర్ నైట్ లోని స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత పలువురు స్టార్, సీనియర్ హీరోల సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సంతకం చేసిన హీరోయిన్గా కూడా రికార్డు సృష్టించింది.
శ్రీ లీల సినిమాలు..
చివరిగా నితిన్(Nithin ), వెంకీ కుడుముల(Venky kudumula) కాంబినేషన్లో వచ్చిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా హిట్ అవుతుందని ఎన్నో కలలు కంది. కానీ పెద్దగా ఈ సినిమా విజయాన్ని అందించలేదు. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలో అవకాశం అందుకుంది. ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. అంతేకాదు ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను భగత్ సింగ్ సినిమా సెట్ లో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టులకు శ్రీ లీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు అటు బాలీవుడ్ లో కూడా కార్తీక్ ఆర్యన్ (Karthik Aryan)తో కలిసి సినిమా చేస్తోంది.
ALSO READ: Hyderabad: ఘనంగా మిల్లెట్ ఉద్యమి భారత్ – 2025.. ఎన్ని రోజులు జరుగుతుందంటే?