E-Paper
Advertisement

ఒక్క హిట్ కొట్టిందో లేదో.. నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న సాత్విక!

ఒక్క హిట్ కొట్టిందో లేదో.. నిర్మాతలకు కండిషన్లు పెడుతున్న సాత్విక!
Advertisement

Satvika veeravalli: సాత్విక వీరవల్లి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగుతున్న పేరు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఆకాశంలో ఒక తార సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే సాత్విక అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. ఆకాశంలో ఒక తార సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈమెకు తెలుగు అలాగే తమిళ భాషలలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సాత్విక వీరవల్లి(Satvika veeravalli) నాగచైతన్య (nagachaitanya)25వ సినిమాలో నటించబోతున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ కూడా ప్రకటించారు.

క్యూ కట్టిన అవకాశాలు..

తెలుగు సినిమాలతో పాటు తమిళంలో కూడా తనకు అవకాశాలు వస్తున్నట్లు సాత్విక తెలియజేశారు. ఇలా మొదటి సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈమె తదుపరి సినిమాలపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇక ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara ) సూపర్ సక్సెస్ కావడంతో నిర్మాతలు ఆకాశమంత విజయం అంటూ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాత్విక నిర్మాత అల్లు అరవింద్ కు ఒక స్వీట్ కండిషన్ పెట్టారు. ఈమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ పుట్టి పెరిగింది మాత్రం అమెరికాలో కావడంతో ఈమె తెలుగు సరిగ్గా రాదు పూర్తిగా అమెరికన్ యాక్సెంట్ మాట్లాడుతున్నారు.

అల్లు అరవింద్ కు సాత్విక కండిషన్..

Advertisement

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈమె తెలుగు గురించి మాట్లాడుతూ తాను గత ఏడాది నుంచి కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నానని తెలిపారు.. అల్లు అరవింద్ గారికి తాను ఒక కండిషన్ పెడుతున్నానని నాగచైతన్య(nagachaitanya) సినిమాలో తానే డబ్బింగ్ చెబుతానంటూ ఈమె ఈ సందర్భంగా కండిషన్లు పెట్టడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ సరదాగా స్పందిస్తూ మొదటి సినిమా హిట్ కొట్టగానే నిర్మాతలకు కండిషన్లు పెట్టేస్తోంది రోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రెండో సినిమాకి డబ్బింగ్ చెప్పబోతున్న సాత్విక..

ఇలా హీరోయిన్లు ఇతర భాష సెలబ్రిటీలు కావడంతో కచ్చితంగా డబ్బింగ్ వాళ్ళే చెప్పుకోవడం కోసం చాలామంది కష్టపడుతూ తెలుగు నేర్చుకున్న వారు ఉన్నారు. ఇక సాత్విక కూడా తన రెండో సినిమాకే తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెబుతానని ఈ సందర్భంగా తెలియచేశారు. ఇక నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదలైన అనంతరం అల్లు అరవింద్ నిర్మాణంలో నాగచైతన్య నటిస్తున్న తన 25వ సినిమా పనులు ప్రారంభం అవుతాయి. ఈ సినిమాకు క్లాక్ దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

Advertisement

Also Read: బిగ్ బాస్ 10 విన్నర్ అతనే.. పుసుక్కున నోరు జారిన సుధీర్..

Related News

రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!

జనవరి 12 విడుదల డబ్బింగ్ షురూ…యమ స్పీడు మీదున్న అనిల్ రావిపూడి!

అనన్య ఇలా అడిగిందేంటి బాబోయ్.. ఫ్యాన్స్‌కు పెద్ద టాస్కే!

జపాన్ లో ‘లెనిన్’ రిలీజ్… ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్..

జగ్గు భాయ్ మంచి మనసు.. వారికి స్పెషల్ బిర్యానీలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?

అల్లు స్నేహా రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. దూసుకు వచ్చిన కారు?

Big Stories

Advertisement
×