E-Paper
Advertisement

రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!

రామ్ చరణ్ తో నటించాలని ఉందా.. ఇలా చేస్తే చాలు!
Advertisement

RC 17 Movie: టాలీవుడ్ మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘RC17’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో అంచనాలు మామూలుగా లేవు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాకు ఇప్పుడు కొత్త యాక్టర్స్ కావాలట. చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేయాలనుకునే టాలెంట్ ఉన్న వాళ్లకు ఇదొక బెస్ట్ ఛాన్స్. ఆడిషన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?:

పదహారు ఏళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు ఉన్న మగవాళ్లు, ఆడవాళ్లు.. ఎవరైనా ఈ ఆడిషన్‌కు ట్రై చేయొచ్చు. ఏజ్‌తో పెద్దగా సంబంధం లేకుండా, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, కాస్త టాలెంట్ ఉంటే చాలు. ఇక సుకుమార్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేసినా సరే, మంచి గుర్తింపు వస్తుంది. అందుకే కొత్త టాలెంట్‌కు ఇదొక మంచి అవకాశం లాంటిది.

రీల్స్ పంపొద్దు.. కాల్స్ చేయొద్దు;

Advertisement

ఆడిషన్ అంటే చాలామంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసి పంపేస్తుంటారు. కానీ ఈ టీమ్ మాత్రం అలాంటి రీల్స్ అస్సలు పంపొద్దని క్లియర్‌గా చెప్పేసింది. మీ ఫోటోలు, ప్రాపర్ ఆడిషన్ వీడియోలను src17casting@gmail.com మెయిల్‌కు లేదా 9110564651 వాట్సాప్ నంబర్‌కు పంపాలి. ఇక ఏదైనా డౌట్ ఉన్నా ఫోన్ కాల్స్ చేయకుండా, వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయాలనే రూల్ పెట్టారు.

చరణ్ మేకోవర్.. లుక్‌లో కొత్త మార్పు:

ఒకవైపు ఆడిషన్లు నడుస్తుండగానే, మరోవైపు చరణ్ తన లుక్ మార్చుకునే పనిలో పడ్డాడు. ‘పెద్ది’ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన చరణ్, ఇప్పుడు సుకుమార్ సినిమా కోసం బరువు తగ్గుతూ కొత్త ఫిట్‌నెస్ మీద కష్టపడుతున్నాడట. ఇక పౌరాణిక ఛాయలు కనిపించిన కాన్సెప్ట్ పోస్టర్‌తో కథ మీద ఆసక్తి పెరిగింది. ఒక స్పెషల్ ప్లేస్‌లో ట్రైనింగ్ తీసుకుంటూ, ఈ కొత్త క్యారెక్టర్ కోసం గట్టిగానే రెడీ అవుతున్నాడు.

షూటింగ్, రిలీజ్ ప్లాన్ ఇదే:

Advertisement

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలవుతుందట. స్టార్ట్ అయ్యాక దాదాపు ఏడాది పాటు షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక రిలీజ్ మాత్రం 2028 సెకండ్ హాఫ్‌లో ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ కలిసి భారీగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా చెప్పలేదు.

also read: ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?

నీ టాలెంట్ చూపించే టైమ్ ఇదే:

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కూర్చోవడం కంటే, ఇలాంటి పెద్ద సినిమాకు సీరియస్‌గా ట్రై చేస్తే లైఫ్ మారే ఛాన్స్ ఉంటుంది. రూల్స్ ఫాలో అవుతూ మీ వీడియో పంపండి. ఎవరికి తెలుసు, రేపు తెరపై చరణ్‌తో కలిసి నువ్వు కనిపించొచ్చేమో.

Related News

జనవరి 12 విడుదల డబ్బింగ్ షురూ…యమ స్పీడు మీదున్న అనిల్ రావిపూడి!

అనన్య ఇలా అడిగిందేంటి బాబోయ్.. ఫ్యాన్స్‌కు పెద్ద టాస్కే!

జపాన్ లో ‘లెనిన్’ రిలీజ్… ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్..

జగ్గు భాయ్ మంచి మనసు.. వారికి స్పెషల్ బిర్యానీలు.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

ఫేక్ పీఆర్ ప్రచారంతో మరో హీరో బలైపోతున్నాడా?

అల్లు స్నేహా రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. దూసుకు వచ్చిన కారు?

రిలాక్స్ మోడ్ లో సంయుక్త.. పాదాలే పాఠం చెబుతాయంటూ!

Big Stories

Advertisement
×