Danush Kuberaa: కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ (Danush)ఇటీవల కాలంలో తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ పై పెట్టారని చెప్పాలి. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఒకానొక సమయంలో హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక తమిళంలో ధనుష్ నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేయడంతో ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి ఆదరణ రావటమే కాకుండా, ఈయనని అభిమానించే వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ధనుష్ తమిళ సినిమాలు తెలుగులో విడుదల చేస్తూనే, మరోవైపు పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీ అవుతున్నారు.
తెలుగు హీరోలకు పోటీ…
సాధారణంగా ఒక భాషలో మంచి సక్సెస్ అందుకున్న హీరోలు ఇతర భాషలలో పూర్తిస్థాయి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించరు. కానీ ఇటీవల కాలంలో మలయాళ ఇండస్ట్రీకి చెందినవారు, తమిళ ఇండస్ట్రీకి చెందినవారు పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో నటిస్తూ తెలుగు హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఈ జాబితాలో దుల్కర్ సల్మాన్, ధనుష్ ముందు వరుసలో ఉన్నారు. ఈ ఇద్దరు హీరోలు పూర్తిస్థాయి తెలుగు హీరోలు మాదిరిగా తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో సందడి చేస్తున్నారు.
తెలుగు డైరెక్టర్లతో హిట్ సినిమాలు…
ధనుష్ ఇటీవల వెంకి అట్లూరి దర్శకత్వంలో నటించిన సార్ (Sir)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అయితే తాజాగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో కుబేర(Kuberaa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా విడుదలైన కుబేర సినిమా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుని పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు ఇటు తెలుగులో అటు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ధనుష్ ఎప్పుడు లేని విధంగా బెగ్గర్ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ పాత్రలో ఈయన జీవిస్తూ తన పాత్రకే ప్రాణం పోశారు.
తెలుగులో డబ్బింగ్…
ఇకపోతే ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో అనే విషయం మనకు తెలిసిందే. అయితే కుబేర విషయంలో మరోసారి తనలో ఉన్న టాలెంట్ బయట పెట్టారు. సాధారణంగా తమిళ హీరోలు తెలుగు స్పష్టంగా మాట్లాడలేరు. అందుకే తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్టుల చేత వారి పాత్రలకు డబ్బింగ్ చెప్పిస్తుంటారు కానీ కుబేర సినిమాకు ధనుష్ పూర్తిస్థాయిలో తన డబ్బింగ్ ఆయనే పూర్తి చేశారని తెలుస్తుంది .ఇలా తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఇదే మొదటిసారి కావటం విశేషం. తెలుగు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పడంతో ధనుష్ తమిళ హీరో కాకుండా పూర్తిస్థాయి తెలుగు హీరోగా మారిపోయారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: శివయ్యా… మరో వివాదంలో కన్నప్ప… ఆ సీన్స్ అన్నీ కాపీనే