The Raja Saa Teaser: ఇటీవల కాలంలో సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సినిమాలకు సంబంధించిన విషయాలు క్షణాలలో బయటకు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమా కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ షూటింగులు జరుపుతున్నారు. కానీ సినిమాలకు సంబంధించిన విషయాలను చాలా సింపుల్ గా సెల్ ఫోన్ కెమెరాలలో బంధించి బయటకు లీక్ చేయడం వల్ల నిర్మాతలు ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన విషయాలు అధికారిక ప్రకటన రాకముందే లీక్ అవ్వటం పట్ల దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సినిమాలకు సంబంధించి ఏ విషయం బయటకు రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ లీకుల పర్వాలను మాత్రం ఆపలేకపోతున్నారు.
మూడు రోజుల ముందే లీక్…
ముఖ్యంగా స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాల విషయంలో ఇలాంటి లీకులు మరింత ఎక్కువవుతున్నాయి. తాజాగా ప్రభాస్(Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్(The Raja Saab) సినిమా విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ విషయం గురించి చిత్ర బృందం గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చినప్పటికీ లీకులు మాత్రం ఆగడం లేదు. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయటానికి మూడు రోజుల ముందే టీజర్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ బయటకు వచ్చాయి. దీంతో చిత్ర బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
చిత్ర బృందం అధికారకంగా టీజర్ విడుదల చేయకుండానే టీజర్ కు సంబంధించిన క్లిప్స్ బయటకు రావడంతో చిత్ర బృందం తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్(Banjars Hills Police Station) ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈనెల 16న టీజర్ రిలీజ్ కాక ముందుగానే కొన్ని క్లిప్స్ బయటకు విడుదల చేశారని ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చిత్ర బృందం పోలీసులను కోరినట్టు తెలుస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని వారిని అసలు వదిలి పెట్టకూడదు అంటూ డబ్బింగ్ ఇంచార్జ్ వసంత్ కుమార్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఇలా చిత్ర బృందం ఈ విషయంపై చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా లీక్స్ ఆపుతారా? లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక తాత మనవడు మధ్య కొనసాగే కథ ఆధారంగా రాబోతుందని సమాచారం. విడుదల చేసిన టీజర్ కు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ కు ఆయన చేసే కామెడీ, తన లుక్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో విడుదలకు సిద్ధమైంది డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తుండగా, మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: పూర్తిగా తెలుగు హీరోగా మారిపోయిన ధనుష్… కుబేరతో ఆ రిస్క్ చేశాడు మరి