Yoga Asanas For Hair: ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, హార్మోన్ల మార్పులు ఇందుకు గల ప్రధాన కారణాలు. జుట్టు రాలే సమస్యను ఎదుర్కునే చాలా మంది ఖరీదైన షాంపూలు , నూనెలను ప్రయత్నింటారు. కానీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో.. యోగా మీకు సహజమైన, ప్రభావవంతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. యోగా శరీరానికి, మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. దీని కారణంగా జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడే మూడు యోగాసనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఉత్తనాసనం:
ఈ ఆసనం వేయడం వల్ల తల వైపు రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని కారణంగా ఆక్సిజన్, పోషకాలు జుట్టు మూలాలకు చేరుతాయి. ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణమైన ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ఆసనం వేయడానికి ముందుగా నిటారుగా నిలబడి, తరువాత నెమ్మదిగా ముందుకు వంగి, మీ చేతులతో పాదాలను తాకడానికి ప్రయత్నించండి. ఈ ప్రక్రియను 30 సెకన్ల నుండి 1 నిమిషం వరకు చేయండి.
2. సర్వాంగసనం:
సర్వాంగసనాన్ని ‘అన్ని ఆసనాలకు తల్లి’ అని కూడా పిలుస్తారు. ఇది మొత్తం శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టుకు కూడా ఒక వరం లాంటిది. ఈ ఆసనం తల వైపు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా జుట్టును బలంగా , మందంగా చేస్తుంది. ఈ ఆసనాన్ని వేయడానికి వెల్లకిళా పడుకుని పడుకుని నెమ్మదిగా మీ కాళ్ళను పైకి లేపండి. తర్వాత మీ చేతులతో మీ నడుమును ఆసరాగా చేసుకుని, మీ మొత్తం శరీరాన్ని మీ భుజాలపై ఉంచండి. మీరు సహాయంతో కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు.
Also Read: హోం మేడ్ హెయిర్ కలర్.. ఇది వాడితే జీవితంలో తెల్ల జుట్టు రాదు
3. వజ్రాసనం:
ఆహారం తిన్న తర్వాత 5 నుండి 10 నిమిషాలు వజ్రాసనంలో కూర్చుంటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరానికి పూర్తి పోషణను అందిస్తుంది. ఈ ఆసనం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని కోసం.. మీరు మోకాళ్లపై కూర్చుని, మీ కాలి వేళ్లను బయటకు ఉంచి, నడుమును నిటారుగా ఉంచండి. తర్వాత కళ్ళు మూసుకుని, లోతైన శ్వాసను తీసుకోండి.