Kannappa Movie : ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మైథాలజికల్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మిక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే పరమశివుడి పట్ల భక్తి చాటుకున్న భక్తి కన్నప్ప గురించి ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఇదే కథతో మంచు విష్ణు(Manchu Vishnu) మరోసారి కన్నప్ప (Kannappa)అనే సినిమా ద్వారా రాబోతున్నారు. శ్రీకాళహస్తి ఆలయలింగ మహత్వం గురించి ఈ సినిమాలో విష్ణు ఎంతో గొప్పగా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.
కన్నప్పను చుట్టుముట్టిన వివాదాలు…
ఇక ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాపై చిత్ర బృందం ఎంతో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాని వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇటీవల బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకత చూపించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ కావటం, సినిమాపై ఎన్నో నెగటివ్ విమర్శలు రావడం జరిగింది. ఇలా వీటన్నింటిని ఎదుర్కొంటూ విష్ణు ముందుకు వెళుతున్న నేపథ్యంలో మరోసారి ఈ సినిమాకు కాపీ వివాదం చుట్టుకుంది.
బాహుబలి సినిమా కాపీనా…
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు కాపీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ ను మొదటిసారి మంచు విష్ణు చూసిన సమయంలో వచ్చే సన్నివేశాలు అచ్చం బాహుబలి(Bahubali) సినిమాలో మొదటిసారి ప్రభాస్ (Prabhas)తమన్నాని(Thamanna) కలిసినప్పుడు తమన్నా తనపై ఏ విధంగా అయితే కత్తి గురి పెడుతుందో, కన్నప్ప సినిమాలో కూడా మంచు విష్ణు పై హీరోయిన్ అలాగే కత్తి గురిపెడుతూ కోపంగా మాట్లాడటం వంటి సన్నివేశాలు మొత్తం బాహుబలి సినిమాలో తమన్నా ప్రభాస్ మధ్య జరిగిన సన్నివేశాన్ని పోలి ఉండటంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.
#Kannappa Movie copy cat ❌
inspiration from #Bahubali ✅#Prabhas | #ManchuVishnu pic.twitter.com/tMWCi4gTUY— Bharat Media (@bharatmediahub) June 18, 2025
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంచు విష్ణు పై మరోసారి ట్రోల్స్ మొదలయ్యాయి. అయ్యయ్యో ఇలా దొరికిపోయావ్ ఏంటి విష్ణు ఈ సీనులన్నీ కూడా బాహుబలి కాపీ నేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీ సినిమాలో ప్రభాస్ నటించినంత మాత్రాన ప్రభాస్ సినిమాలో సన్నివేశాలనే ఇలా కాపీ కొడతారా? అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి కన్నప్ప సినిమా పై వస్తున్న కాపీ ట్రోల్స్ గురించి విష్ణు స్పందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని జేఆర్ సీ కన్వెన్షన్ లో జరగబోతుందని తెలుస్తోంది. ఇక ఈ వేడుకకు ప్రభాస్ వస్తారని వార్తలు వస్తున్నాయి కానీ ఇంకా అధికారికంగా మాత్రం తెలియజేయలేదు.
Als0 Read: ఈ చిన్నకారణంతో రాజశేఖర్ కూతురికి సినిమాలు ఛాన్స్‌లు రావడం లేదట