E-Paper
Advertisement

టికెట్ రూ.150.. పాప్‌కార్న్ రూ.220! ధరలపై నిర్మాత ధీరజ్ షాకింగ్ కామెంట్స్

టికెట్ రూ.150.. పాప్‌కార్న్ రూ.220!  ధరలపై నిర్మాత ధీరజ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

Dheeraj Mogilineni:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద సినిమాలు ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాయో చెప్పక్కర్లేదు. ఇక వీటి చుట్టూనే సినిమా బిజినెస్ తిరుగుతుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు కూడా. అయితే మంచి కథలు ఉన్నప్పటికీ చిన్న సినిమాలకు మాత్రం థియేటర్లు దొరకడం గగనం అయిపొయింది.

దొరికినా ఆడియన్స్ థియేటర్ల మొహమే చూడటం మానేశారు.ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలను ఎలా ఎంకరేజ్ చేయాలి? కొత్త దర్శకులకు అవకాశాలు ఎలా రావాలి? థియేటర్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరగాలి అనే విషయాలపై నిర్మాత ధీరజ్ మొగిలినేని ఇలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు.

Advertisement

నిర్మాతగా ఉండటమే ఇష్టం.. డిస్ట్రిబ్యూషన్ మాత్రం ప్యాషన్!

ఇక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్.. ఈ మూడు విభాగాల్లో ఏది ఎక్కువ ఇష్టమని అడగ్గా ప్రొడక్షన్ అని చెప్పుకొచ్చాడు. మనకు నచ్చిన కథను సెలెక్ట్ చేసుకుని, సినిమాగా తీసి, ప్రమోషన్స్ చేసి థియేటర్లలో విడుదల చేయడంలో వచ్చే సంతృప్తి వేరే లెవెల్‌లో ఉంటుందని తెలిపాడు.మనమే కూరగాయలు కొనుక్కొని, మనమే బిర్యానీ వండుకుని తింటే ఎంత ఆనందంగా ఉంటుందో సినిమా నిర్మించడం కూడా అలాంటిదేనని తెలిపాడు.

Advertisement

సింగిల్ స్క్రీన్ల కంటే మల్టీప్లెక్స్‌లే బెటరా?

థియేటర్ల బిజినెస్ గురించి కూడా ధీరజ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తాను 10 నుంచి 15 థియేటర్లను నిర్వహిస్తున్నానని, భవిష్యత్తులో మంచి మల్టీప్లెక్స్‌లు నిర్మించాలనే కోరిక ఉందని చెప్పారు.అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లను తీసేయాలని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. పాత థియేటర్లను ఆధునీకరించి మంచి సౌకర్యాలు కల్పిస్తే అవి కూడా బాగా నడుస్తాయని అభిప్రాయపడ్డాడు .ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో పాత థియేటర్లను రీనోవేట్ చేసి మల్టీప్లెక్స్‌లుగా మార్చే అవకాశం ఉందని చెప్పాడు.

మల్టీప్లెక్స్‌లకు మాత్రం బిజినెస్ పరంగా ఓ ప్రత్యేకమైన అడ్వాంటేజ్ ఉంటుందని వివరించాడు. ఉదాహరణకు 600 సీట్లున్న సింగిల్ స్క్రీన్‌లో ఓ సినిమా ఆడకపోతే థియేటర్ యజమానికి నష్టం తప్పదు. అదే మూడు, నాలుగు స్క్రీన్లు ఉన్న మల్టీప్లెక్స్‌లో ఒక సినిమా ఆడకపోతే దాని షోలు తగ్గించి, మంచి కలెక్షన్లు వస్తున్న సినిమాలకు ఎక్కువ షోలు కేటాయించవచ్చు.

అందుకే కార్పొరేట్ సంస్థలు మల్టీప్లెక్స్‌లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పాడు. అంతేకాదు, మల్టీప్లెక్స్ అంటే కేవలం సినిమా చూసి ఇంటికి వెళ్లే ప్రదేశం మాత్రమే కాదని, షాపింగ్, ఫుడ్ కోర్ట్, ప్లే ఏరియా వంటి సౌకర్యాలతో కుటుంబాలు నాలుగైదు గంటలు గడిపే ప్రదేశంగా మారిందని వివరించాడు.

టికెట్ ధర రూ.150.. పాప్‌కార్న్ ధర రూ.220.. ఇదేం లెక్క!

సినిమా ప్రేక్షకులకు ప్రస్తుతం ఎదురవుతున్న మరో ప్రధాన సమస్య మల్టీప్లెక్స్‌లలో ఫుడ్ ధరలు. రూ.150 పెట్టి సినిమా టికెట్ కొన్నా, పాప్‌కార్న్ కోసం రూ.220 చెల్లించాల్సి వస్తోందని ఇంటర్వ్యూలో ప్రస్తావించగా ధీరజ్ కూడా తన అభిప్రాయాన్ని చెప్పాడు

ముఖ్యంగా PVR, INOX, Cinepolis వంటి కార్పొరేట్ మల్టీప్లెక్స్‌లలో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నాడు. ప్రసాద్‌, ఏషియన్ వంటి థియేటర్లలో ధరలు కొంత అందుబాటులో ఉంటాయని చెప్పాడు.కుటుంబంతో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పిల్లలు పాప్‌కార్న్, కూల్‌డ్రింక్ అడిగితే ధరలు చూసి వద్దని చెప్పాల్సిన పరిస్థితి ఉండకూడదన్నాడు.

కొన్నిసార్లు ఇచ్చే పాప్‌కార్న్ టబ్‌లు కూడా చాలా పెద్దగా ఉంటాయని, సినిమా పూర్తయ్యేలోపు వాటిని తినడం కూడా కష్టమని సెటైర్ వేశాడు.ఇక టికెట్ ధరల గురించి మాత్రమే కాకుండా థియేటర్లలో తినేవాటి ధరల గురించి కూడా ఆలోచించాలని చెప్పాడు.మొత్తానికి థియేటర్ వ్యవస్థ పై ధీరజ్ చేసిన ఈ కామెంట్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ALSO READ :ప్రదీప్, నస్లెన్‌తో నన్ను పోల్చకండి బాబోయ్.. మౌళి అసలు బాధ ఇదే!

Tags

Related News

కిడ్నాప్ చేయబోయి అడ్డంగా బుక్కైన గ్యాంగ్.. సుధీర్ గోట్ ట్రైలర్ ఎలా ఉందంటే?

ప్రదీప్, నస్లెన్‌తో నన్ను పోల్చకండి బాబోయ్.. మౌళి అసలు బాధ ఇదే!

‘అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’ సోషల్ మీడియాను ఊపేస్తున్న గద్దర్ నరసన్న ఫోక్ సాంగ్

వియత్నాంలో కావ్య కళ్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీ.. ఫోటోలు వైరల్!

నచ్చకపోతే రిజెక్ట్ చెయ్యి..రాధిక ఆప్టేపై రెజీనా కామెంట్స్ వైరల్!

ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!

కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?

Big Stories

Advertisement
×