E-Paper
Advertisement

‘అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’ సోషల్ మీడియాను ఊపేస్తున్న గద్దర్ నరసన్న ఫోక్ సాంగ్

‘అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’  సోషల్ మీడియాను ఊపేస్తున్న గద్దర్ నరసన్న ఫోక్ సాంగ్
Advertisement

Madarasi Rabbaru Bomma Song: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ కి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెండితెరపై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతి ఒక్క సినిమాలో కూడా దర్శక నిర్మాతలు ఫోక్ సాంగ్ ఉండేలాగా చూసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన పలు సినిమాలలో ఫోక్ సాంగ్స్ (Folk Songs) సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇకపోతే త్వరలోనే మరొక ఫోక్ సాంగ్ వెండి తెరపై సందడి చేయబోతోంది. ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) నటిస్తున్న టైసన్ నాయుడు(Tyson Naidu) సినిమాలో మదరాసి రబ్బరు బొమ్మ(Madarasi Rabbaru Bomma) అంటూ సాగిపోయే ఒక ఫోక్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

మదరాసి రబ్బరు బొమ్మ ప్రోమో రిలీజ్..

ఈ పాటకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో కేవలం 28 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ అవుతుంది. ఇక ఈ పాట పూర్తి లిరిక్స్ రేపు విడుదల కాబోతుంది. అయితే ఈ పాటకను ఫోక్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నల్గొండ గద్దర్ నరసన్న(Nalgonda Gaddar Narasanna) పాడటం హైలెట్ గా నిలిచిందని చెప్పాలి.’అచ్చం నల్ల చీర.. చీర అంచున మల్లెమొగ్గ’ అంటూ లిరిక్స్ ఉన్న ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైన కేవలం ఒక గంట వ్యవధిలోనే 10 వేలకు పైగా వ్యూస్ కైవసం చేసుకోవడం గమనార్హం.

సాయి శ్రీనివాస్ , నేహా శెట్టి జంటగా..

Advertisement

ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నేహా శెట్టి జంటగా స్టెప్పులు వేశారు. ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా, నల్గొండ గద్దర్ నరసన్న, రోహిణి సూరత్ ఆలపించారు. ప్రముఖ దర్శకుడు సాకర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మదరాశి రబ్బరు బొమ్మ అంటూ సాగిపోయే ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ ద్వారా గద్దర్ నరసన్న భారీగా ఫేమస్ అయ్యారు. ఇటీవల ఈయన పాడిన పాటలకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. గద్దర్ నరసన్న పాటలు మిలియన్ సంఖ్యలో వ్యూస్ కైవసం చేసుకుంటున్నాయి. మరి మదరాసి రబ్బరు బొమ్మ సాంగ్ ఎలాంటి ఆదరణ పొందుతుందనేది తెలియాల్సి ఉంది.

Also Read: వియత్నాంలో కావ్య కళ్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీ.. ఫోటోలు వైరల్!

Related News

ప్రదీప్, నస్లెన్‌తో నన్ను పోల్చకండి బాబోయ్.. మౌళి అసలు బాధ ఇదే!

వియత్నాంలో కావ్య కళ్యాణ్ రామ్ బ్యాచిలర్ పార్టీ.. ఫోటోలు వైరల్!

నచ్చకపోతే రిజెక్ట్ చెయ్యి..రాధిక ఆప్టేపై రెజీనా కామెంట్స్ వైరల్!

ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!

కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?

‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిందా..?

బాలయ్య ఫ్యాన్స్‌కు పండగే.. డిసెంబర్ 24న దాదా దండయాత్ర!

Big Stories

Advertisement
×