Regina Cassandra -Radhika Apte: రాధిక ఆప్టే గత రెండు రోజులుగా సోషల్ మీడియా వార్తల్లోకి నిలుస్తున్నారు. ఈమె కీర్తి సురేష్ తో కలిపి అక్క ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సౌత్ ఇండస్ట్రీలో తాను ఒక సినిమాలో తన మామయ్యనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని బాలకృష్ణ లెజెండ్ సినిమా(Legend Movie) గురించి ఈమె కామెంట్స్ లో చేశారు. ఇలా తనకంటే వయసులో పెద్ద వ్యక్తితో రొమాన్స్ చేశానని, ముందుగా నాకు ఈ విషయం తెలిసి ఉంటే సినిమా చేసేదాన్ని కాదు సినిమాకు సైన్ చేసిన తర్వాత ఈ విషయాన్ని చెప్పారని రాధిక ఆప్టే(Radhika Apte) వెల్లడించారు.
ఇలా బాలకృష్ణ సినిమాలో నటించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఇప్పుడు సౌత్ సినిమాలను చాలా చులకనగా చేసి మాట్లాడటంతో ఈమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా రాధిక ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలపై నటి రెజీనా(Regina) స్పందించారు. ప్రస్తుతం రెజీనా మహాశక్తి సినిమా(Mahasakthi Movie) ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రెజీనా భైరవి అనే పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా నవంబర్ ఆరో తేదీ విడుదల కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యల పట్ల ప్రశ్నలు ఎదురు కావడంతో రెజీనా స్పందిస్తూ.. ఏదైనా ఒక సినిమా అవకాశం వచ్చినప్పుడు ఆ సినిమా కథ నచ్చకపోతే రిజెక్ట్ చేయాలి. ఆ సినిమా చేయాలని ఎవరు మనల్ని బలవంతం చేయరు. ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా పట్ల విమర్శలు చేయడం సరికాదని రెజీనా తెలిపారు. ముఖ్యంగా నార్త్ సౌత్ అంటూ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలను తాను అంగీకరించని ఈమె తెలిపారు.
ఇక తాను కూడా నార్త్ సినిమాలలో నటించాను ముఖ్యంగా కేసరి 2 సినిమాలో తన పేరును కూడా తొలగించారని ఈమె తెలిపారు. ధర్మాన ప్రొడక్షన్స్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నేను ప్రముఖ పాత్ర పోషించినప్పటికీ నా సినిమాను ప్రమోట్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఎలాంటి వివరణ లేకుండానే ప్రమోషన్స్ నుంచి నా పేరును తొలగించారు. మరి నేను ఏ విధంగా స్పందించాలి అంటూ ఈ సందర్భంగా రెజీనా ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపారు. ఇలా నాకు ఉత్తరాది దక్షిణాది సినిమాలు అంటూ వ్యత్యాసాలు చేసి మాట్లాడితే ఏమాత్రం నచ్చదు అంటూ ఈమె రాధిక ఆప్టే అలాగే జాన్వి కపూర్ ఇటీవల సౌత్ సినిమా గురించి చేసిన విమర్శలపై కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read: ఐశ్వర్య అర్జున్ ఉమాపతి విడాకుల వార్తలు..తంబి రామయ్య రియాక్షన్ ఇదే!